AP Half Day Schools: వేసవితో పాటు పదో తరగతి పరీక్షల( 10th class exams ) నేపథ్యంలో పాఠశాలల నిర్వహణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 16 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే హాల్ టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభం అయింది.. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థులకు ఉచిత ప్రయాణం కూడా కల్పించింది. వేసవి నేపథ్యంలో ఒంటిపూట బడులు నిర్వహించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధపడింది. ఈనెల 16 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. అదేరోజు పదో తరగతి పరీక్షల నిర్వహణ కూడా ఉంటుంది. ఒకవేళ ఆ పాఠశాలలో పదో తరగతి పరీక్షల కేంద్రం నిర్వహిస్తే మధ్యాహ్నం పూట మిగతా తరగతులకు విద్యా బోధన ఉండనుంది. ఈ మేరకు పదో తరగతి పరీక్షల నిర్వహణ, ఒంటిపూట బడుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
* కృష్ణా జిల్లాలో సెలవు
రేపు రెండో శనివారం( second Saturday ). సాధారణంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు దినం. కానీ కృష్ణాజిల్లాలో రేపు రెండో శనివారం సెలవు రద్దు చేస్తూ ఆ జిల్లా డీఈవో నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ఈనెల 14న రెండో శనివారం సెలవు లేకుండా పనిచేస్తాయని డీఈవో సుబ్బారావు ప్రకటించారు. గత ఏడాది అక్టోబర్ లో తుఫాన్ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో నాలుగు రోజులపాటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అయితే ఆ సెలవులకు బదులుగా అన్ని విద్యాసంస్థలు ఇప్పటికే మూడు రోజులు పని చేశాయి. మిగిలిన ఒక్కరోజు సెలవుకు బదులు రేపు రెండో శనివారం పాఠశాలలు తెరవనున్నాయి. ఈ నిబంధన ఒక్క కృష్ణాజిల్లాకు మాత్రమే.
* ఒంటిపూట బడులు 16 నుంచి..
వేసవి ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో.. మార్చి 16 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒంటిపూట బడులు( half day schools) అమల్లోకి రానున్నాయి. తెలంగాణలో సైతం ఇదే తరహా నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పాఠశాల నిర్వహణ ఉంటుంది. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్నచోట మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఇంకోవైపు పదో తరగతి పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు పంపిణీ ప్రారంభం అయింది. ఇప్పటికే అధికారిక వెబ్ సైట్ లో http://bse.ap.gov.in లో పొందుపరిచారు. ఏప్రిల్ ఒకటి వరకు పదో తరగతి పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలు కొనసాగుతాయి.
