AP Rains: ఏపీలో( Andhra Pradesh) వాతావరణం విచిత్రంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన వచ్చింది వాతావరణ శాఖ నుంచి. మిగిలిన జిల్లాల్లో సైతం తేలికపాటి జల్లుల నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. గాలి ఎక్కువగా ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. కాగా అకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నారు. వాతావరణం మార్పులతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈరోజు ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన తెలిపింది వాతావరణ శాఖ. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండ. అకస్మాత్తుగా మేఘావృతం.. కొద్దిసేపటికి వర్షాలు మొదలవుతున్నాయి.
Also Read: అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవం .. చిరంజీవి గైర్హాజరుకు కారణాలు అవే!
* ఉదయం నుంచి ఎండల తీవ్రత..
ఉదయం 7 గంటల నాటికి భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మధ్యాహ్నం కి విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. ఉదయం 10 తర్వాత రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర పనులు తప్పిస్తే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతుండడంతో చల్లటి వాతావరణం ఉంది. ప్రధానంగా ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో( parvatipuram manyam district ) అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రేపు కూడా ఈ వర్షాలు పడవచ్చని అంచనా వేసింది. వర్షం సమయంలో భారీ ఈదురు గాలులు సైతం వీచే అవకాశం ఉంది.
* ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు..
మరోవైపు విశాఖపట్నం( Visakhapatnam), అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల,ప్రకాశం, నెల్లూరు,నంద్యాల, తిరుపతి,అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్య సాయి, కడప జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడరాదని.. బలమైన ఈదురు గాలులు పట్ల అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది.
* రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు( temperatures ) నమోదవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంది. శుక్రవారం కడప జిల్లా కమలాపురంలో 42 డిగ్రీలు, నంద్యాల జిల్లా గొల్లదుర్తిలో 41.7°, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 41.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ ప్రతికూల పరిస్థితులతోనే ఇలా భిన్నమైన భిన్నమైన వాతావరణం ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు శుక్రవారం తెల్లవారుజాము నుంచి ప్రకాశం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. కనిగిరిలో ఈదురుగాలితో కూడిన భారీ వర్షం కురిసింది. పల్నాడు జిల్లాలో కూడా వర్షాలు కురిసాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడ్డాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అక్కడక్కడ గాలులు వీచాయి. మొత్తం మీద ఈ భిన్న వాతావరణంతో జనాలుకు అవస్థలు తప్పడం లేదు.
Also Read: అర్జెంటీనాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలతో దక్షిణ అమెరికా అప్రమత్తం