AP Rains: ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటాయని ఐఎండీ(IMD) ఇప్పటికే ప్రకటించింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అన్నట్లుగానే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే భానుడు భగ్గుమంటున్నాడు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీలకుపైగా నమోదవుతోంది. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ మరోమారు చల్లటి కబురు చెప్పింది.
Also Read: చంద్రబాబు పి4కి రూ.10 కోట్లు.. ఈ విషయంలో మెచ్చుకోవాల్సిందే
ఎండ వేడి.. వేడి గాలులు(Hot winds), ఉక్కపోత(Swetting)తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. అకాల వర్షాలు, పిడుగులు ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. దక్షిణ అండమాన్(South Andman) సముద్ర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
వాతావరణ శాఖ హెచ్చరిక..
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, ఆదివారం, సోమవారం కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉంది. అలాగే, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. శనివారం కాకినాడ, అనకాపల్లి, శ్రీకాకుళం, పల్నాడు, బాపట్ల, గుంటూరు వంటి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. కాకినాడ జిల్లాలోని వేలంకలో రాత్రి 8 గంటల వరకు అత్యధికంగా 56.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ అసాధారణ వాతావరణం రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
తెలంగాణలో..
ఇక తెలంగాణ(Telangana)లోనూ పరిస్థితి భిన్నంగా లేదు. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు పటు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ వాతావరణ మార్పులు స్థానిక జీవనోపాధులపైనా ప్రభావం చూపుతున్నాయి. వర్షాలతో రోడ్లు జలమయం కాగా, ఈదురుగాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు ప్రభుత్వ సహాయం కోరుతున్నారు. వాతావరణ శాఖ అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ, అవసరమైన హెచ్చరికలను జారీ చేస్తున్నారు.