AP Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో( Telugu States) చలి తీవ్రత కొనసాగుతోంది. అయితే గతంతో పోల్చితే కొంత తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా ఉదయం వేళల్లో ఇంకా చల్లని వాతావరణం కొనసాగుతోంది దీనికి తోడు పొగ మంచు కనిపిస్తోంది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వాతావరణంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై వాతావరణ శాఖ తాజా అంచనాలను వెల్లడించింది. శివరాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని.. తరువాత క్రమేపి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని స్పష్టం చేసింది.
* అరేబియా వైపు ద్రోణి
ప్రస్తుతం ఉత్తర కేరళ( North Kerala) నుంచి అరేబియా సముద్రం వైపు అల్పపీడన ద్రోణి కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో దక్షిణ భారతంలోని కొన్ని రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ముఖ్యంగా ఏపీలోని కొన్ని ప్రాంతాలపై ప్రభావం కనిపించడం ఉందని అంచనా వేస్తున్నారు. మంగళవారం తో పాటు బుధవారం ఉత్తర కోస్తా ఏపీతోపాటు యానాం ప్రాంతాల్లో పొడి వాతావరణాన్ని కొనసాగునుంది. అయితే ఉదయం వేలల్లో మాత్రం పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంది. పగటి సమయంలో మాత్రం ఆకాశం సాధారణంగా నిర్మలంగానే ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఏపీ తో పాటు ఎటువంటి వరుస సూచనలు లేవు. వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఎక్కువ. రాయలసీమ ప్రాంతంలో మంగళవారం నుంచి పొడి వాతావరణం కొనసాగనుంది. వర్షాలకు అనుకూల పరిస్థితులు కనిపించడం లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
* వర్ష సూచన ఇదే..
తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం, బుధవారం ఎటువంటి వర్ష సూచన లేదు. వాతావరణం పొడిగానే ఉండనుంది. కొన్ని ప్రాంతాల్లో ఉదయం వేళల్లో చలితో పాటు పొగ మంచు కనిపించే అవకాశం ఉంది. కొద్ది రోజులపాటు ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు అలానే కొనసాగుతాయి. శివరాత్రి తరువాత మాత్రం ఉష్ణోగ్రతలు క్రమేపి పెరగనున్నాయి. అయితే ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడ్డాయి. ప్రస్తుతానికి భూగర్భ జలాలకు ఎటువంటి ప్రమాదం లేదు. అయితే ఈ ఏడాది ఎండల తీవ్రత సైతం అదే స్థాయిలో ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి.