AP Pensions: ఏపీ ప్రభుత్వం( AP government) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్ల మంజూరుకు నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలను సైతం సిద్ధం చేసింది. భర్తను కోల్పోయిన వితంతువులను ఆదుకోవడం కోసం 89, 788 కొత్త వితంతు పెన్షన్లకు ఆమోదం తెలిపారు. మే నెల మొదటి తారీకు నుంచి వీరందరికీ పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి జూన్ నుంచి అందజేసే అవకాశం కనిపిస్తోంది. మిగిలిన కేటగిరీలకు సంబంధించి కసరత్తు కొనసాగుతోంది. వచ్చేనెల తొలి వారంలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఏపీ ప్రభుత్వం దాదాపు లక్ష కొత్త పెన్షన్లకు ఆమోదం తెలిపింది.సెర్ఫ్ అధికారుల నివేదిక మేరకు సీఎం చంద్రబాబు ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Also Read: ఐసీసీ లో దక్షిణాఫ్రికా.. ఐపీఎల్ లో రాజస్థాన్.. దురదృష్టానికి కేరాఫ్ అడ్రస్ జట్లివి!
*గత కొద్దిరోజులుగా పింఛన్లు దూరం..
గత కొద్ది రోజులుగా భర్తను కోల్పోయిన వితంతువులకు పింఛన్లు(Vidows pentions )అందడం లేదు. అప్పటివరకు అందుకుంటున్న భర్త చనిపోయిన తర్వాత కూడా చాలామందికి పింఛన్ అప్డేట్ కాలేదు. అయితే మధ్య మధ్యలో ఏపీ ప్రభుత్వం ఇటువంటి పెన్షన్ల నమోదు విషయంలో మినహాయింపులుస్తూ వచ్చింది. అయితే ఈసారి పెండింగ్లో ఉన్న 89, 788 పెన్షన్లు అందించేందుకు ఆమోదం తెలిపారు. వచ్చే నెల నుంచి వీరికి పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తాజాగా దరఖాస్తు చేసుకున్న వితంతువుల కు మాత్రం జూన్ నుంచి అందజేస్తారు.
* అప్పట్లో నిరంతర ప్రక్రియ..
వాస్తవానికి వితంతు పింఛన్ పథకం అనేది నిరంతర ప్రక్రియ గా కొనసాగేది. 2014 నుంచి 2019 మధ్య టిడిపి ప్రభుత్వం ( TDP government) భర్త చనిపోయిన వెంటనే వితంతువుకు పెన్షన్ అందించే విధానాన్ని కొనసాగిస్తూ వచ్చింది. లబ్ధిదారులు వారంలో ఏ రోజైనా సరే పెన్షన్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. అధికారులు వాటిని ఏవరానికి ఆ వారం పరిశీలించి నెలాఖరుకు పెన్షన్ జాబితాను సిద్ధం చేసేవారు. అందుకే మరోసారి ఆ విధానాన్ని పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇకనుంచి భర్త చనిపోయిన వెంటనే వితంతువు దరఖాస్తు చేసుకుంటే పెన్షన్ అందించే ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది.
* బోగస్ పింఛన్లపై ఫోకస్
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా దివ్యాంగుల కోటాలో ఇస్తున్న పెన్షన్లలో భారీగా బోగస్ ఉన్నట్లు గుర్తించింది. తప్పుడు సదరం ధ్రువపత్రం పెట్టి అనర్హులు సైతం పింఛన్లు పొందినట్లు తేలింది. లబ్ధిదారుల పరిశీలనకు ప్రత్యేక వైద్య బృందాలు సైతం వెళ్ళాయి. త్వరలో బోగస్ పింఛన్లకు సంబంధించి తొలగింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఈరోజు నుంచి వితంతు పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈనెల 30 లోపు అర్హులంతా వివరాలు సమర్పిస్తే.. మే 1న పింఛన్ డబ్బులు అందుకోవచ్చు. ఈ లోపు నమోదు చేసుకోలేని వారికి జూన్ 1 నుంచి పింఛన్ చెల్లిస్తారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వం పై నెలకు 36 కోట్ల వరకు భారం పడే అవకాశం ఉంది.
* దానికి వైసిపి ప్రభుత్వం బ్రేక్..
భర్త చనిపోయిన వెంటనే వితంతువుకు పింఛన్ అందించే ప్రక్రియకు బ్రేక్ వేసింది వైసిపి ప్రభుత్వం( YSR Congress Government). ప్రతి ఆరు నెలలకు ఒకసారి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. ఫలితంగా గత ఆరు నెలల్లో 89 వేలకు మందికి పైగా పింఛన్ పొందకుండా ఉండిపోయారు. ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే విధానం ఉంటే వీరందరికీ లబ్ధి చేకూరేది. కానీ వైసిపి ప్రభుత్వ నిర్వాకంతో వీరికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీరి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అందుకే వీరందరికీ పింఛన్లు మంజూరు కానున్నాయి.
Also Read: మాజీ మంత్రి విడదల రజిని చుట్టు ఉచ్చు.. బెదిరింపు కేసులో కీలక అరెస్ట్!