Andhra Pradesh IAS Transfers : ఏపీలో (Andhra Pradesh) అధికారుల బదిలీలు సర్వసాధారణం అయ్యాయి. గత కొద్ది రోజులుగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరుగుతూ వస్తున్నాయి. తాజాగా మరోసారి అధికారుల బదిలీలు, కొత్త పోస్టులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పలు కీలక శాఖలో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లు, ముఖ్య విభాగాల్లో డైరెక్టర్లు, కమిషనర్లు, సీఈఓ లు, ఎండి ల నియామకం జరిగింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.
* కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గా మల్లరపు నవీన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా మొగిలి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు.
* ఏపీ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ గా ఎస్.నాగలక్ష్మిని నియమించారు
* రాష్ట్ర ఖాదీ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కట్టా సింహాచలం..
* పట్టణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ గా అలిమినేని భార్గవ్ తేజ..
* స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ గా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్..
* ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ గా చామకూరి శ్రీధర్..
* రిహాబిలిటేషన్ రీ సెటిల్మెంట్ డైరెక్టర్ గా ప్రశాంతి..
* రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా మల్లికార్జున్ లను దీవించింది రాష్ట్ర ప్రభుత్వం..