AP News : ఈ క్రమంలో 25 జిల్లాలలో పెట్రోల్ బంకులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇకపై మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు కూడా నడిచేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 25 జిల్లాలలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా ఎదగడం మరియు వ్యాపారంలో విజయవంతం కావడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ సదుపాయంతో డ్వాక్రా మహిళలు స్వయం ఉపాధి పొందడంతో పాటు వ్యాపారంలో స్థిరపడడం మరియు తమ కుటుంబాలను ఆర్థికంగా బలపరచడం కోసం మరింత సులభమైన మార్గం ఏర్పడుతుందని తెలుస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో త్వరలో 25 జిల్లాలలో మహిళల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు మొదలుకానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది మొదటిసారిగా చేస్తున్న కార్యక్రమం. మహిళల ఆర్థిక స్వాతంత్ర్యాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్ బంకులను మహిళల స్వాధీనంలో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.మహిళలకు ఇది వ్యాపారంలో నైపుణ్యం అభివృద్ధి చేసుకోవడానికి మరియు ఆర్థిక స్వలంబన కల్పించడానికి గొప్ప అవకాశం గా మారుతుంది.
Also Read : ఏపీలో ఉపాధ్యాయుల కష్టాలకు లోకేష్ చెక్.. కొత్తగా ఆ యాప్!
అలాగే ప్రభుత్వం పెట్రోల్ బంకుల స్థలాల కోసం కూడా అనేక విధాలుగా సహాయం చేస్తుంది. దీనిలో భాగంగా డ్వాక్రా మహిళలకు రూ. లక్ష సహాయం అందించనుంది. ఈ డబ్బుతో పాటు మెప్మా స్వయం సహాయక సంఘాలకు రు.6 వేలకోట్ల పొదుపు డబ్బులను ఉపయోగించి వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు కూడా అమలు చేయనుంది. ఇది మహిళలకు స్వయం ఉపాధి కలిగించడం కోసం సహకారం అందించేలా తయారైన ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అధ్య వాహనాలు అందించడానికి రాపిడో సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకుందని తెలుస్తుంది.
ఈ క్రమంలో డ్వాక్రా మహిళలు సులభంగా అద్దెకు వాహనాలను తీసుకొని తమ సొంత ఆర్థిక అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. వీటితోపాటు ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాహనాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా డ్వాక్రా మహిళల కోసం ప్రారంభించారు. అలాగే డ్వాక్రా మహిళలకు మరొక ఉపాధి అవకాశంగా నగరాలలో స్మార్ట్ స్ట్రీట్ వెల్డింగ్ మార్కెట్లను కూడా త్వరలో ప్రారంభించనున్నారు. రానున్న రోజుల్లో మహిళలకు వ్యాపారంలో స్థిరపడడానికి మరియు వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఈ మార్కెట్లో ఎంతో సహాయపడతాయి.