Jaat Movie : మాస్ హీరో ఎప్పటికైనా మాస్ హీరో నే. ఇన్నేళ్ల వయస్సు వచ్చినా మాస్ ఆడియన్స్ లో చెక్కు చెదరని క్రేజ్ ఉంటుంది అని మరోసారి నిరూపించి చూపించాడు బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్(Sunny Deol). 67 ఏళ్ళ వయస్సు ఉన్న సన్నీ డియోల్ ఒకప్పుడు బాలీవుడ్ లో మాస్ హీరో గా ఎన్నో సంచలన రికార్డ్స్ ని నెలకొల్పాడు. అలాంటి సూపర్ స్టార్ మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లి అడపాదడపా సినిమాలు చేస్తుండేవాడు, అవి పెద్దగా ఆడేవి కాదు కానీ, ఇప్పుడు మళ్ళీ ఆయన పూర్తి స్థాయిలో సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. ‘గద్దర్ 2’ చిత్రం తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి ఎన్నో సంచలన రికార్డ్స్ ని నెలకొల్పిన సన్నీ డియోల్, ఇప్పుడు ‘జాట్'(Jaat Movie) చిత్రం తో మరో బాక్స్ ఆఫీస్ సెన్సేషన్ ని నెలకొల్పాడు.
Also Read : ‘ఓజీ’ ఈ ఏడాది లో విడుదల అవ్వడం కష్టమేనా..? జూన్ లో ఏమి జరగబోతుంది?
మన టాలీవుడ్ యంగ్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం లో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ ని సొంతం చేసుకుంది. అప్పుడే వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మొదటి రోజున 9 కోట్ల 62 లక్షలు, రెండవ రోజున 7 కోట్లు, మూడవ రోజున పది కోట్లు,కే నాల్గవ రోజున 14 కోట్లు, 5 వ రోజు 7 కోట్ల 30 లక్షలు, ఆరవ రోజున 6 కోట్ల రూపాయిలు, 7 వ రోజున 4 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా మొదటి వారం ఈ చిత్రానికి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 58 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ కూడా భారీ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ వీకెండ్ తో ఈ చిత్రం వంద కోట్ల రూపాయిల నెట్ వసూళ్లకు చాలా దగ్గరగా వెళ్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఫుల్ రన్ లో ఇదే స్టడీ గా వసూళ్లను రాబడితే, రీసెంట్ గా విడుదలైన సల్మాన్ ఖాన్ ‘సికందర్’ చిత్రాన్ని కూడా ఈ సినిమా అధిగమించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మాస్ సెంటర్స్ లో ఈ చిత్రానికి డైలీ కలెక్షన్స్ ‘పుష్ప 2’ కంటే బెటర్ ట్రెండ్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ వారం కొత్త సినిమాలు ఈ చిత్రంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా మరో పక్క IPL సీజన్ కూడా ఈ సినిమాపై ఇసుమంత ప్రభావం కూడా చూపకపోవడం గమనార్హం. ఇకపోతే నేడే ‘జాట్’ చిత్రానికి సీక్వెల్ కూడా ప్రకటించారు మేకర్స్. త్వరలోనే పూర్తి స్థాయి వివరాలు తెలియనున్నాయి.
Also Read : దేవర’ జపాన్ క్లోజింగ్ కలెక్షన్స్..’రంగస్థలం’ కి దరిదాపుల్లో లేదుగా!