Homeఆంధ్రప్రదేశ్‌AP COVID Variant: ఏపీలో కరోనా కొత్త వేరియంట్.. కలకలం!

AP COVID Variant: ఏపీలో కరోనా కొత్త వేరియంట్.. కలకలం!

AP COVID Variant: ఏపీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కొత్త వేరియంట్ విస్తరిస్తోంది. కరోనా సృష్టించిన విలయతాండవం ఇప్పటికీ అందరి మనసులో నాటుకు పోయింది. అటువంటి మహమ్మారి మళ్ళీ కోరలు చేస్తోంది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. కడప జిల్లాలో వెలుగు చూసిన నమూనాలను.. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రీసెర్చ్ సంస్థలో పరీక్షిస్తే.. ఆర్ ఎఫ్ 5 వేరియంట్ గా నిర్ధారించారు. అయితే దీనితో వచ్చే ప్రమాదం ఏమీ లేదు అని.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో పాటు వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

* వైరస్ లక్షణాలు..
ఈ కొత్త రకం వేరియంట్ కు సంబంధించి.. గతంలో కోవిడ్ 2 వైరస్.. కార్యక్రమంలో ఓమిక్రాన్ రూపాంతరం చెందింది. దాని నుంచి మరో రూపం జే ఎన్ 1కాగా.. ఎల్ ఎఫ్ 7,1.1.1 బ్రాంచ్ లు ఏర్పడ్డాయి. వీటి రెండింటి కలయికే ఆర్ఎఫ్ 5 అని పూణేలోని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ కొత్తరకం వేరియంట్ సోకిన వారికి దగ్గు, జలుబు, గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరం ఎక్కువగా వస్తాయి. వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

* మళ్లీ జాగ్రత్తలు..
అయితే కరోనా కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో రద్దీగా ఉన్న ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. ప్రధానంగా సుగర్, శ్వాస సంబంధిత సమస్యలు, కిడ్నీ రోగులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారు తొలుత హోమ్ ఐసోలేషన్ లో కొనసాగాలని.. మూడు నాలుగు రోజుల్లో తగ్గకపోతే వెంటనే వైద్యులను ఆశ్రయించాలని చెబుతున్నారు. తొలుత కడపలో, తరువాత గుంటూరులో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version