Homeఆంధ్రప్రదేశ్‌AP New DGP: ఏపీ పోలీస్ శాఖకు కొత్త బాస్.. ఆ ముగ్గురిలో ఒకరు!

AP New DGP: ఏపీ పోలీస్ శాఖకు కొత్త బాస్.. ఆ ముగ్గురిలో ఒకరు!

AP New DGP: ఏపీ ప్రభుత్వం ( AP government)కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఒకవైపు పాలనను సజావుగా ముందుకు తీసుకెళ్తూనే కీలక నియామకాలు చేపడుతోంది. అందులో భాగంగా త్వరలో రాష్ట్రానికి కొత్త డీజీపీని నియమించనుంది. అందుకు సంబంధించి కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత డిజిపి గా ఉన్న హరీష్ కుమార్ గుప్తా ఈ యాడాది ఆగస్టు 2న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో కొత్త డిజిపి ఎవరన్న చర్చ తెరమీదకి వస్తోంది. డీజీపీగా చాలామంది సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు మేరకు మాత్రమే డిజిపి ఎంపిక ఉంటుంది. ఓ 12 మంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు డీజీపీ పోస్ట్ కోసం పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: ఏపీలో ఓ ప్రభుత్వ పాఠశాల రికార్డ్!

* అదే ఆనవాయితీగా..
సీనియర్ ఐపీఎస్ అధికారులను ( senior IPS officers )డీజీపీలుగా ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ జాబితాలో మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నారు. ఆయన 1991 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆ తరువాత స్థానంలో పీఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు. ఆయన 1992 బ్యాచ్ కు చెందిన అధికారి. అటు తరువాత రాజేంద్రనాథ్ రెడ్డి తో పాటు నలిని ప్రభాత్ కూడా ఉన్నారు. 1993 బ్యాచ్ కు చెందిన అధికారులు సైతం డీజీపీ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు. మహేష్ దీక్షిత్, అమిత్ గార్గ్, పీవీ సునీల్ కుమార్, విశ్వజిత్, రవిశంకర్ అయ్యానార్, బాలసుబ్రమణ్యం, కృపా నందు త్రిపాటి ఉన్నారు. ఇందులో ఒకరికి డిజిపి పోస్ట్ ఖాయం.

* కొనసాగింపు అనుమానమే..
హరీష్ కుమార్ గుప్తా( Harish Kumar Gupta) డిజిపి గా కొనసాగింపు ఉండదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అందుకే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ 12 మందితో కూడిన సీనియర్ అధికారుల జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. అయితే కేవలం ముగ్గురు పేర్లనే ప్రతిపాదించనుంది. అందులో ఒక్కరిని కేంద్రం ఎంపిక చేయనుంది. వారే ఈ రాష్ట్రానికి కొత్త డిజిపి. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఈ సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చింది అన్న విమర్శ ఉంది. ఎక్కడో జాబితాలో 12వ పేరుగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని తెచ్చి సుదీర్ఘకాలం డిజిపిగా బాధ్యతలు అప్పగించింది.

* ప్రముఖంగా ఆయన పేరే..
అయితే చంద్రబాబు సర్కార్( Chandrababu government) మాత్రం మాదిరెడ్డి ప్రతాప్ పేరును పరిగణలోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన 1991 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. 2026 జూలై 1న పదవీ విరమణ చేస్తారు. సమర్థవంతమైన అధికారిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. మాదిరెడ్డి ప్రతాప్ విషయంలో సీఎం చంద్రబాబు సైతం సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

 

Also Read: ప్రతిపక్షంలో దీక్షలు.. అన్నేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు కవితక్క?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version