AP New Bar Policy: మద్యం వ్యాపారం( liquor business ).. గతంలో కొన్ని వర్గాలు మాత్రమే చేసేవి. కానీ ఇదో లాభసాటి వ్యాపారం కావడంతో అన్ని వర్గాల ప్రజలు ఈ వ్యాపారంలో భాగస్వాములయ్యారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని మార్చింది. ప్రైవేటు మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తులు స్వీకరించింది. లాటరీ ద్వారా షాపులు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా 3400కు పైగా దుకాణాలను ఏర్పాటు చేసింది. అయితే ఈ షాపులు దక్కించుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. చివరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. దరఖాస్తు రూపంలో నాన్ రిఫండబుల్ నగదు రెండు వేల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి సమకూరింది దరఖాస్తుల ద్వారా. అయితే అదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది వందల బార్లు ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ బార్లకు వ్యాపారుల నుంచి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. దీంతో ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. అయితే బార్లు ఆదరణ నోచుకోకపోవడానికి కారణం మద్యం దుకాణాలు. దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయి.
– ప్రైవేటు మద్యం దుకాణాల్లో అన్ని రకాల ప్రీమియం బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రైవేట్ దుకాణాల వైపు ఎక్కువమంది మొగ్గు చూపుతారు.
– ప్రతి మద్యం దుకాణం వద్ద పర్మిట్ రూములను అందుబాటులోకి తెచ్చారు. అంటే అక్కడే తాగేందుకు మందుబాబులకు వీలుంటుంది. అందుకే అక్కడ తాగేందుకు మొగ్గుచూపుతుండడంతో బార్లకు వచ్చే ఛాన్స్ ఉండదు.
– మద్యం దుకాణాల చుట్టూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటల్లు ఉంటున్నాయి. అక్కడకు మద్యం తీసుకుని తాగే వారే అధికం. ఇది కూడా బార్లు పై మందుబాబుల ఆసక్తి తగ్గడానికి కారణం.
– ఊరు రా బెల్ట్ షాపులు దర్శనం ఇస్తున్నాయి. ఊర్లోకి మద్యం వస్తుండడంతో మందుబాబులు బార్లకు వెళ్లి తాగేందుకు ఇష్టపడడం లేదు.
– బార్లలో ప్రతి బాటిల్ పై అదనంగా వసూలు చేస్తారు. పని గట్టుకొని అక్కడకు వెళ్లి తాగాల్సి ఉంటుంది. అందుకే బార్లలో క్రమేపి మందుబాబుల సంఖ్య తగ్గుతుంది. ఇది కూడా బార్ల దరఖాస్తులు తగ్గడానికి ప్రధాన కారణం.
– వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు నడిచేవి. అక్కడ నాసిరకం మద్యం దొరికేది. పేరు మోసిన ప్రీమియం బ్రాండ్లు లభించేవి కావు. అందుకే ఎక్కువమంది ఎక్కువ ధర అయినా బార్లకు వెళ్లి తాగేవారు.
– మద్యం దుకాణాల ద్వారా నాన్ రిఫండబుల్ నగదును దాదాపు 2000 కోట్ల రూపాయల వరకు వెనుకేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు బార్ల ద్వారా అదే స్థితిలో వసూలు చేయాలని చూసింది. ఒక్కో బారుకు తప్పనిసరిగా 5 దరఖాస్తులు రావాలని నోటిఫికేషన్ లో పేర్కొంది. దీంతో ఒక్కో షాపుకు ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది.
– రెండో విడతగా 500 బార్లకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించింది ఎక్సైజ్ శాఖ. కానీ వచ్చిన దరఖాస్తులు ఐదు మాత్రమే. వాటికి డ్రా తీయడం అనేది ఇబ్బందికరమే.
– గతంలో బార్లు అంటే వ్యాపారులు ఎగబాకే వారు. కానీ మారిన పరిస్థితులతో ఎవరు ముందుకు రాని దుస్థితి.
– ప్రభుత్వం బార్ల వ్యాపారుల కోసం ఎక్సైజ్ అధికారులకు టార్గెట్లు విధిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అయితే ఎన్ని రకాల ఒత్తిడిలు చేసిన వ్యాపారుల నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో కదలిక లేదు. ఇక ప్రభుత్వమే తేల్చుకోవాలి.