Is the film industry in danger: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా తయారయింది… ప్రేక్షకులు సినిమా థియేటర్ కెళ్ళి సినిమాలను చూడడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. ఇక దానికి తోడుగా ఓటిటి సంస్థలు విజృంభించడంతో కేవలం ఓటిటి లోనే సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ పరిస్థితికి చెక్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా మన హీరోలు సైతం భారీ గా రెమ్యూనరేషన్స్ ను తీసుకొని మూడు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేసి టికెట్ రేట్లను పెంచడం వల్ల ఇలాంటి దుస్థితి ఏర్పడిందని కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక చిన్న సినిమాల పరిస్థితి మరి దారుణంగా తయారైంది. సినిమా సూపర్ సక్సెస్ అనే టాక్ వస్తే తప్ప థియేటర్లకి ప్రేక్షకులైతే రావడం లేదు. మరి దీనివల్ల చిన్న సినిమాలకు కూడా భారీగా నష్టమైతే వాటిల్లుతోంది.
ఒకప్పుడు తక్కువ మంది హీరోలు ఉండి ఎక్కువ సినిమాలు చేయడం వల్ల ఒక సినిమా ఫ్లాప్ అయినా కూడా మరొక సినిమా సక్సెస్ అయ్యేది. అలాగే ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమాలు చూడడానికి ఆసక్తి చూపించేవారు. కానీ ఇప్పుడు హీరోలు ఎక్కువ అయిపోయారు. సినిమాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి.
దీనివల్ల సక్సెస్ ఫుల్ టాక్ వచ్చిన సినిమాలను మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మిగతా సినిమాలను పట్టించుకోవడం లేదు.ఇక 500 కోట్లు బడ్జెట్ ను పెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన కూడా నష్టాలైతే తప్పడం లేదు.ఇక కొన్ని చిన్న సినిమాలు ఒకటి రెండు కోట్లు బడ్జెట్ తో వచ్చి 40 నుంచి 50 కోట్ల వరకు కలెక్షన్స్ ను వసూలు చేస్తున్నాయి…
మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ చాలా రిస్క్ లో ఉందనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి వీటికి చెక్ పెడితే తప్ప ఫ్యూచర్లో సినిమా ఇండస్ట్రీ అనేది సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగే ప్రయత్నం అయితే చేయలేకపోతోంది. మరి దీనికి చెక్ ఎవరు పెడతారు, ఎలా పెట్టాలి అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది…