AP Liquor scam : ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటివరకు కూటమి వెర్సెస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టు పరిస్థితి సాగింది. కానీ ఉన్నట్టుండి వైయస్సార్ కాంగ్రెస్ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ ప్రకంపనలకు కారణమవుతున్నారు. కొద్ది రోజుల కిందట ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. అయితే ఆయన రాజకీయాలనుంచి వైదొలగడంతో సైలెంట్ అవుతారని అంతా భావించారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకున్నారు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ అనుకూల మీడియా నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి స్పందించిన తీరు చూస్తుంటే మాత్రం వైసిపి గుండెల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. విజయసాయిరెడ్డి ఎన్నెన్నో సంచలన విషయాలు బయట పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం పై విజయసాయిరెడ్డి వరుసగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.
Also Read : టిడిపిలోకి అవంతి.. పనిచేసిన కుమార్తె మంత్రాంగం!
* బట్టేబాజ్ అంటూ కామెంట్స్
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో సూత్రధారిగా రాజ్ కసిరెడ్డిగా అనుమానిస్తున్నారు. ఈరోజు గోవా నుంచి వస్తుండగా పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజ్ కసిరెడ్డికి ఉచ్చు బిగించేందుకు సహకరిస్తున్న విజయసాయిరెడ్డి పై ఆయన మండిపడ్డారు. మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియా రాజ్ కసిరెడ్డి అంటూ గతంలో సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల ఆధారంగా.. ఆయనను సిట్ సాక్షిగా పిలిచి విచారణ జరిపింది. ఇందులో సాయి రెడ్డి ఇచ్చిన వివరాల ఆధారంగా కసిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ తరుణంలో కసిరెడ్డి ఆడియో విడుదల చేశారు. సాయి రెడ్డిని బట్టే బాజ్ అన్నారు. తన కేసు వ్యవహారం తేలగానే సాయి రెడ్డి అక్రమాలను బయట పెడతానని హెచ్చరించారు. అయితే ఇంతలోనే రాజ్ కసిరెడ్డి అరెస్టయ్యారు.
* సంచలన ట్వీట్
అయితే ఈ పరిణామాల క్రమంలో విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) ఈరోజు సంచలన ట్వీట్ చేశారు. మద్యం కుంభకోణంలో తన పాత్ర విజిల్ బ్లోయర్ అంటూ పేర్కొన్నారు. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరును లాగుతున్నారంటూ కసిరెడ్డి పై సాయి రెడ్డి ఫైర్ అయ్యారు. తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని.. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారని.. వారి మిగతా బట్టలు విప్పేందుకు తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. తద్వారా మద్యం కుంభకోణంలో మిగతా వారి వివరాలు బయట పెడతానంటూ పరోక్ష హెచ్చరికలు జారీచేశారు.
* ప్రమాదంలో ఆ ఇద్దరు..
మద్యం కుంభకోణంలో ఎంపీ మిధున్ రెడ్డి( MP Mithun Reddy ) పాత్ర ఉన్నట్లు కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం అనుమానించింది. అందుకు తగ్గట్టుగానే పావులు కదిపింది. ఇంతలో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు మిథున్ రెడ్డి. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజ్ కసిరెడ్డి ని హెచ్చరించడం ద్వారా.. మున్ముందు కీలక నేతల పేర్లు బయట పెడతానని సంకేతాలు ఇచ్చారు. రాజు కసిరెడ్డిని విచారించడం ద్వారా వైసిపి పెద్దల పాత్రను బయటకు లాగేందుకు సిఐడి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే సాయి రెడ్డి కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సాయి రెడ్డి నోరు విప్పితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతతో పాటు ఆయన కుమారుడు అడ్డంగా బుక్కయ్యే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో
ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 22, 2025