AP Liquor Scam New Twist: ఏపీలో( Andhra Pradesh) మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం అనుమానిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణను ప్రారంభించింది. ఇప్పటికే ఈ కేసులో కీలక అరెస్టులు కూడా జరిగాయి. ముందుగా కేసులో కీలక పాత్రధారిగా అనుమానిస్తున్న రాజ్ కసిరెడ్డి అరెస్టు జరిగింది. తరువాత అప్పటి సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్ ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డిల అరెస్టు కూడా పూర్తయింది. అటు తర్వాత పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లు, ఇతరత్రా అంశాలు తెరపైకి వచ్చాయి. మరోవైపు సీటు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ తరుణంలో ఓ కానిస్టేబుల్ వాంగ్మూలం, డిజిపి కి పూర్తి వివరాలతో రాసిన లేక కలకలం రేపుతోంది.
చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేని మద్యం స్కాంలో అక్రమంగా ఇరికించేందుకు భారీగా కుట్రలు జరుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సిట్ అధికారులు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. చెవిరెడ్డి గారి దగ్గర పనిచేసిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్… pic.twitter.com/KpBtM7yLAs
— YSR Congress Party (@YSRCParty) June 17, 2025
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్ మెన్
గతంలో పదేళ్లపాటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి( chevireddy Bhaskar Reddy ) వద్ద గన్ మెన్ గా పనిచేశారు మదన్ అనే కానిస్టేబుల్. అయితే ఆయనను లిక్కర్ స్కాం విచారణలో భాగంగా సిట్ అధికారులు హింసించారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలంటూ దాడి చేసినట్లు బాధితులు చెబుతున్నాడు. తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ తనను కొట్టారంటూ గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఫోటోలను కూడా అతను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కు పంపాడు. తన మొహం మీద, వీపు మీద సిట్ అధికారులు పిడుగులు గుద్దినట్లు అతను ఆరోపిస్తున్నాడు. చేతి వేళ్ళు వెనక్కి గురించి తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని హింసించారని చెబుతున్నాడు. ఇందుకు సంబంధించి క్షుణ్ణంగా వివరాలతో డిజిపి కి లేఖ రాశాడు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read: AP Liquor scam : ఏపీ మద్యం కుంభకోణం.. జగన్ సన్నిహిత నేత అరెస్ట్.. ఆ ఎంపీకి ఉపశమనం!
బలవంతంగా వాంగ్మూలం..
మద్యం కుంభకోణం( liquor scam ) పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే కీలక అరెస్టులతో పాటు విచారణను కూడా ముమ్మరం చేసింది సిట్. అప్పట్లో ప్రభుత్వ పెద్దలుగా వ్యవహరించిన నేతల అనుచరులు, వారి వద్ద పనిచేసిన వారి నుంచి వివరాలు సేకరిస్తోంది. ఈ క్రమంలో కీలక నేతగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద పనిచేసిన కానిస్టేబుల్ మదన్ ను విచారించినట్లు తెలుస్తోంది. 200 కోట్లు డబ్బులు రవాణా చేసినట్లు స్టేట్మెంట్ ఇవ్వాలని తనను స్విఫ్ట్ అధికారులు వేధించినట్లు మదన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ఈ ఘటనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపిస్తోంది. మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డిని ఇరికించే ప్రయత్నం జరుగుతోందని అనుమానిస్తోంది. దీనిపై న్యాయపరంగా పోరాడుతామని వైయస్సార్సీపి లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తెలిపారు. అయితే ఇప్పటికే కీలక అరెస్టులు జరిగిన నేపథ్యంలో.. వారి వాంగ్మూలం తోనే.. కానిస్టేబుల్ మదన్ ను విచారించినట్లు తెలుస్తోంది. అయితే బాధితులు మాత్రం తనతో బలవంతంగా వాంగ్మూలం ఇప్పించేందుకు ప్రయత్నాలు చేశారని చెబుతుండడం విశేషం.