AP liquor scam: ఏపీలో మద్యం కుంభకోణం( liquor scam )ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని అదుపులోకి తీసుకుంది ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్. తాజాగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది. ఈ సందర్భంగా తన ఆవేదన వ్యక్తం చేస్తూ గట్టిగానే అరిచారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సిట్ బృందంలో రాజమౌళి, సుకుమార్ కు మించిన దర్శకులు ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కాలం తప్పకుండా సమాధానం చెబుతుందని హెచ్చరించారు. అక్రమ అరెస్టులు చేసిన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Gudivada Amarnath Vs Nara Lokesh: లోకేష్ వర్సెస్ అమర్నాథ్ : ఏంటీ గుడ్డు, శోభనం కథ?
మద్యం కుంభకోణం పై విచారణ..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో మూడున్నర వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం అనుమానించింది. దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులు ఒక్కొక్కరు జైలు పాలవుతున్నారు. తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన అనుచరులు అరెస్టయ్యారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మద్యం వ్యాపారుల నుంచి వసూలు చేసిన డబ్బులను హైదరాబాదులో రాజ్ కసిరెడ్డి, వెంకటేష్ నాయుడుల నుంచి రవాణా చేసినట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందంలో సైతం ఇదే తేలినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో మద్యం ద్వారా సంపాదించిన సొమ్మును ఖర్చు పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి భాస్కర్ రెడ్డిని వినియోగించుకున్నారన్నది ప్రధాన ఆరోపణ.
Also Read: Jagan Kotamreddy Fallout: జగన్ కంట్లో నలుసుగా ఒకప్పటి వీర విధేయుడు!
తుడా వాహనాలలో డబ్బు తరలింపు
వైసిపి హయాంలో తుడా చైర్మన్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి( cheveireddy Bhaskar Reddy ) వ్యవహరించారు. మద్యం కంపెనీల నుంచి సేకరించిన సొమ్మును తరలించే బాధ్యతను చెవిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. చెవిరెడ్డి తన మనసులను రంగంలోకి దించి వందల కోట్లను ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంపించేందుకు.. తుడా కార్లను వినియోగించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం కుంభకోణం పై సిట్ ఏర్పాటు అయింది. విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయనను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే చెవిరెడ్డి అరెస్టు సమయంలో ప్రత్యేక దర్యాప్తు బృందంలో పెద్దపెద్ద దర్శకులు ఉన్నారంటూ.. తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోవాల్సిందే నంటూ హెచ్చరికలు జారీ చేయడం విశేషం.
నా మీద తప్పుడు కేసు పెట్టారు… అన్యాయంగా జైలుకు పంపుతున్నారు.
ఈ సిట్ లో రాజమౌళి, సుకుమార్ లాగా ఒక గొప్ప దర్శకుడు ఉన్నాడు… అన్నిటికి కాలం సమాధానం చెప్తుంది.
తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్కడిని దేవుడు శిక్షిస్తాడు – @YSRCParty మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి pic.twitter.com/QBV5ltGwxD
— greatandhra (@greatandhranews) July 1, 2025