AP Lands : ఏపీలో ఈ భూములు హాట్ కేక్.. ధరలు ఎంతో తెలుసా?

జూన్ 1 నుంచి ఈ పెరిగిన భూముల మార్కెట్ విలువ అమలులోకి రానుంది. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీ పెరిగిపోయింది.

Written By: Dharma, Updated On : June 3, 2023 12:26 pm
Follow us on

AP Lands : ఏపీలో భూముల మార్కెట్ విలువ పెరిగింది.  ఈ రోజు నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రస్థాయిలో కాకుండా ఏ జిల్లాకు ఆ జిల్లాల్లోనే మార్కెట్ విలువ పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి  జాయింట్ కలెక్టర్లు ఒక జాబితాను సిద్ధం చేశారు. కొత్త జిల్లాలను టార్గెట్ చేస్తూ కొత్త జాబితాలు రూపొందాయి. 13 జిల్లాలకుగాను 26 జిల్లాలుగా మార్చిన సంగతి తెలిసిందే. దీంతో జిల్లా కేంద్రంలో భూముల విలువ పెంచేందుకు ప్రభుత్వం డిసైడయ్యాయి. జిల్లాల పునర్విభజన తరువాత గత ఏడాది కొన్ని ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ పెంచారు. ఇప్పుడు మరికొన్ని ప్రాంతాల్లో పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

భూముల క్రయ, విక్రయాలు, రిజిస్ట్రేషన్లు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు. రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయమే సింహభాగం. ప్రస్తుతం సంక్షేమ పథకాలకు, బటన్ నొక్కుడుకు వైసీపీ సర్కారు భారీగా ఖర్చు చేస్తోంది. అటు అప్పులు కూడా ఎక్కువగా చేస్తోంది. ఈ తరుణంలో ఆదాయ వనరులపై దృష్టిపెట్టింది. చివరకు చెత్త పై కూడా పన్ను వేసింది. భూముల వెల్యూషన్ పెంపుతో ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. అందుకే పెంపు నిర్ణయానికి వచ్చింది. ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కింద 50 గ్రామాలు ఉన్నాయనుకుంటే వాటిలో 20 శాతం గ్రామాల్లో భూముల మార్కెట్ విలువను పెంచుతుంది. కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 20 శాతం, మరికొన్ని ప్రాంతాల్లో 30 శాతం పైన పెంచే అవకాశాలు కనబడుతున్నాయి.

భూముల వెల్యూషన్ పెంపుపై ప్రభుత్వం భారీగా కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. ఇందుకుగాను గత రెండు, మూడు రోజులుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపివేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సర్వర్ సమస్యను కారణంగా చూపించారు. వాస్తవానికి 2020 తర్వాత ఏపీలో మార్కెట్ విలువను పెంచలేదు. గత ఏడాది కొత్త జిల్లాల ఏర్పాటు కాకముందు ఉమ్మడి జిల్లాలోని బాపట్ల, పల్నాడు, గుంటూరులో మార్కెట్ విలువను పెంచింది ఏపీ ప్రభుత్వం. 2022 ఏప్రిల్ లో కొత్త జిల్లా కేంద్రాలు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ పెంచింది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో విశాఖ లాంటి నగరాల్లో భూముల ధరలు అమాంతం పెరగనున్నాయి.

ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. డిమాండ్ ఉన్న ఏరియాల్లో 60 శాతం, మధ్యస్థంగా ఉన్న ఏరియాల్లో 40 శాతం, తక్కువ డిమాండ్ ఉన్న ఏరియాల్లో 30 శాతం మేర భూముల ధరలు పెంచనున్నట్లు తెలుస్తోంది. గజం రూ. 60 వేల నుంచి రూ. 65 వేలకు, రూ. 18 వేల నుంచి రూ. 28 వేలకు పెంచనుంది. . జూన్ 1 నుంచి ఈ పెరిగిన భూముల మార్కెట్ విలువ అమలులోకి రానుంది. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీ పెరిగిపోయింది. ఇదే కారణం చూపి భూములు, ఇళ్ల స్థలాల రేట్లకు రెక్కలొచ్చాయి. గతం కంటే రెట్టింపు ధర చెబుతున్నారు.
Recommended Video: