https://oktelugu.com/

Director Teja: సురేష్ బాబు సెట్స్ కి వస్తే అభిరామ్ సినిమా చేయను అన్నాడు

అహింస జూన్ 9న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. తేజ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. దగ్గుబాటి రామానాయుడుకి తాను మాటిచ్చిన విషయం ఆయన గుర్తు చేసుకున్నారు. అభిరామ్ ని తన దర్శకత్వంలో లాంచ్ చేయాలని రామానాయుడు అడిగారట. ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకున్నానని తేజ అన్నారు. వారసులు పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారంటే పోలికలు మొదలవుతాయి.

Written By:
  • Shiva
  • , Updated On : June 1, 2023 / 10:08 AM IST

    Director Teja

    Follow us on

    Director Teja: దర్శకుడు తేజ భారీ కమర్షియల్ హిట్ కొట్టి ఏళ్ళు గడచిపోతుంది. చిత్రం, నువ్వు నేను, జయం చిత్రాలతో ఆయన టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయ్యారు. కొత్తవాళ్లతో ఇండస్ట్రీ హిట్స్ కొట్టడం ఆయన ప్రత్యేకత. ఆయన కథలు ఇప్పుడు మ్యాజిక్ చేయడం లేదు. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన నేనే రాజు నేనే మంత్రి మాత్రమే హాట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఆయన దగ్గుబాటి వారసుడు అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తున్నారు. అహింస టైటిల్ తో ఓ ప్రయోగాత్మక చిత్రంతో వస్తున్నారు.

    అహింస జూన్ 9న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. తేజ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. దగ్గుబాటి రామానాయుడుకి తాను మాటిచ్చిన విషయం ఆయన గుర్తు చేసుకున్నారు. అభిరామ్ ని తన దర్శకత్వంలో లాంచ్ చేయాలని రామానాయుడు అడిగారట. ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకున్నానని తేజ అన్నారు. వారసులు పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారంటే పోలికలు మొదలవుతాయి.

    అభిరామ్ కి సినీ నేపథ్యం ఉంది. ఆల్రెడీ స్టార్స్ గా వెలిగిపోతున్న వెంకటేష్, రానాలతో అభిరామ్ ని పోల్చడం సరికాదన్నారు. దగ్గుబాటి వారసుడిగా నా కంటే కూడా తనపై ఎక్కువ బాధ్యత ఉంది. ఒత్తిడి ఉందని తేజ అభిప్రాయపడ్డారు. ఒక రోజు అహింస సెట్స్ కి సురేష్ బాబు వచ్చారు. ఆయన సెట్లో ఉంటే నేను నటించను అని అభిరామ్ అన్నాడు. సురేష్ బాబు మానిటర్ వెనుక కూర్చున్నారు. వెంకీ, రానా సైతం సురేష్ బాబు సెట్స్ లో ఉంటే భయపడతారని తేజ అన్నారు.

    అహింస ఓ ఫిలాసఫీ ఆధారంగా తీశాము. అహింసను ఎలా ఉపయోగించాలనేది చెప్పాలనుకున్నాము. ఈ మూవీలో 14 ఫైట్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని ఫైట్స్ కి నేను స్వయంగా ఫైట్ మాస్టర్ గా వ్యవహరించాను. సినిమా బాగా ఆడితే కొత్తవాళ్లతో సినిమాలు చేస్తాను. రానా హీరోగా రాక్షస రాజు టైటిల్ తో మూవీ చేయనున్నట్లు తేజ చెప్పారు. ఎప్పటిలాగే బ్యాక్ గ్రౌండ్ లేని టాలెంట్ ని ప్రోత్సహిస్తానని చెప్పుకొచ్చారు