AP Heavy Rain Alert: ఏపీకి( Andhra Pradesh) రెండు రోజులపాటు భారీ వర్ష సూచన ఉంది. రాయలసీమ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం రాయలసీమపై ప్రభావం చూపుతుందని.. రెండు రోజులపాటు రాయలసీమ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో మూడు ఆవర్తనాలు కొనసాగుతున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా రాయలసీమపై వీటి ప్రభావం అధికమని స్పష్టం చేసింది.
ఈరోజు భారీ వర్షాలు..
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు( heavy rains ) కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా అనంతపురం, సత్యసాయి, వైయస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రతో పాటు కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
Read Also: భారతదేశంలో 5 అందమైన రైలు ప్రయాణాలు ఇవీ..
విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే రాయలసీమలో( Rayalaseema ) భారీ వర్షాలు నమోదయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది. ప్రజలు చెట్లు, టవర్లు విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని సూచిస్తోంది. పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున.. వీలైనంతవరకు బయట పనులు, కార్యక్రమాలు ఆపడం మంచిదని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది. పిడుగుల పడే సమయంలో పొలాల్లో పని చేసే రైతులు, బహిరంగ ప్రదేశాల్లో పని చేసే కార్మికులు, పశువుల కాపర్లు, గొర్రెలు మేపేవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. భారీ వర్షం కురిసే సమయంలో లోతట్టు ప్రాంతాలలో ఉండొద్దని సూచిస్తున్నారు.
Read Also: కొత్త జిల్లాలపై కీలక ప్రకటన చేసిన సీఎం
రాయలసీమలో భారీ వర్షం..
గత రెండు రోజులుగా ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాయలసీమ వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యాయి. బాపట్ల( Bapatla),పల్నాడు ప్రాంతాల్లో సైతం వర్షాలు పడుతున్నాయి. అయితే వాతావరణ సమతూల్యత దెబ్బతింటోంది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షపాతం లోటు కనిపిస్తోంది. సరైన వర్షాలు పడడం లేదు. ఆ ప్రభావం ఖరీఫ్ పై పడింది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఉబాలు జరగలేదు. దమ్ము పెట్టేందుకు అవసరమైన వర్షాలు పడలేదు. అయితే ఈ ఏడాది ముందుగానే నైరుతి రుతుపవనాలు ఏపీకి తాకాయి. విస్తరించాయి కానీ.. ఆశించిన స్థాయిలో వర్షాలు మాత్రం పడకపోవడం విశేషం.