AP Green Energy Corridor: ఏపీకి( Andhra Pradesh) మరో గుడ్ న్యూస్ వచ్చింది. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ కు గ్రీన్ సిగ్నల్ లభించింది. కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు పంపాలని ఏపీ ట్రాన్స్కోను ఆదేశించింది. ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసేందుకు వీలుగా ఈ వివరాలు కోరినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు రూ.6,450 కోట్లను గ్రాంటుగా అందించనుంది. ఇది నిజంగా రాష్ట్రానికి గొప్ప శుభవార్త. పారిశ్రామిక అభివృద్ధికి ఒక ముందడుగు. మొత్తం రూ.21,500 కోట్లతో ట్రాన్స్కో గ్రీన్ ఎనర్జీ కారిడార్ను ప్రతిపాదించారు. సోలార్ పవర్ 11 వేల మెగావాట్లు, పంప్డు స్టోరేజ్ ప్రాజెక్టుల నుంచి 7300 మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం నెట్వర్క్ విస్తరించేలా ప్రణాళిక రూపొందించారు.
* ప్రతిష్టాత్మక ప్రాజెక్టు..
విద్యుత్ శాఖలో ఇదో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. ట్రాన్స్కో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ను( transco green energy corridor) నాలుగు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు ఒక్కో దశ పూర్తి చేయడానికి రెండేళ్ల చొప్పున సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. దాదాపు 8 ఏళ్ల నుంచి 10 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తిస్థాయిలో పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. భవిష్యత్తులో విద్యుత్ సరఫరాకు సంబంధించిన నెట్వర్కు సమస్యలు లేకుండా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
* పెద్ద ఎత్తున పరిశ్రమల రాకతో..
విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చిన సంగతి తెలిసిందే. దానికి అనుబంధంగా పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు రానున్నాయి. అందుకే అక్కడ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని నెట్వర్క్ ముఖ్య ఉద్దేశం. అందుకే అక్కడ విస్తరణ పై ఫోకస్ పెట్టారు. రాయలసీమలో ఉన్న సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ సెంట్రల్ నెట్వర్క్ అనుసంధానం చేయనున్నారు. దీనికిగాను 17 సబ్ స్టేషన్ల ద్వారా సరఫరాకు నిర్ణయించారు. 400 కె.వి సామర్థ్యంతో నాలుగు కొత్త సబ్ స్టేషన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. రాయలసీమ పరిధిలో ఎక్కువ శాతం రెన్యువల్ ప్రాజెక్టులు ఏర్పాటు అవుతుండడంతో.. అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తును కోస్తాతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలకు తరలించాలన్నదే ఈ గ్రీన్ క్యారీడర్ ముఖ్య ఉద్దేశం. రానున్న 10 ఏళ్లలో ఎక్కడ విద్యుత్ సమస్య లేకుండా చూడాలన్నదే ప్రణాళికగా తెలుస్తోంది.
