spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh Heatwave: ఏపీలో ఏంటి విపత్కాలం

Andhra Pradesh Heatwave: ఏపీలో ఏంటి విపత్కాలం

Andhra Pradesh Heatwave: ఏపీలో( Andhra Pradesh) పరిస్థితి చేయి దాటుతోంది. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతోంది. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ప్రజలు రోడ్ల మీదకు రావాలంటే హడలెత్తిపోతున్నారు. నడి వేసవి రాకముందే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తున్నాయి. ఇప్పట్లో ఇది ఆగేలా కనిపించడం లేదు. ఒక్కో ప్రాంతంలో అయితే 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటుతోంది. 40 డిగ్రీలు అనేది సర్వసాధారణంగా మారింది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఒకటే పరిస్థితి. వందలాది మండలాలకు తీవ్రవడగాలులు తప్పడం లేదు. రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అతి తీవ్రమైన వేడిగాలులు, ఉష్ణోగ్రత పంజా విసురుతున్నాయి. కోస్తాంధ్రతో పాటు తీర ప్రాంతంలో ఉక్కపోత అప్పడం లేదు. ఊపిరి సలపనివ్వడం లేదు.

* మే చివరి వరకు ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు తప్పవు అని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. ఎండల తీవ్రత చూస్తుంటే 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్య చాన్స్ కనిపిస్తోంది. ఆదివారం కర్నూలు జిల్లా నగర డోనలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. రాష్ట్రంలో ఎక్కువ శాతం నమోదయింది ఇక్కడే. కడప పట్టణంలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఇది రెండో అత్యధికం. 18 జిల్లాల పరిధిలోని 172 మండలాల్లో 71 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి.

* నేడు అనగా సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వర రామచంద్రపురం, గుర్తుతెడు మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉంది.* విజయనగరం జిల్లాకు సంబంధించి బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, మెంటాడ, రామభద్రపురం, వంగర.. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియమ్మ వలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, సాలూరు, సీతానగరం, వీరఘట్టం మండలాల్లో ఎండల తీవ్రత కొనసాగనుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version