https://oktelugu.com/

Kadambari Jethwani case : ఏపీ చరిత్రలోనే సంచలనం.. జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ సస్పెన్షన్

కాదంబరి జెత్వాని కేసులు కీలక ట్విస్ట్. కూ టమి ప్రభుత్వం పట్టు బిగిస్తోంది. కఠిన చర్యలకు దిగుతోంది. ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీస్ ఉన్నతాధికారులపైసస్పెన్షన్ వేటుపడుతోంది. తాజాగా ముగ్గురు ఐపీఎస్ అధికారులపై చర్యలకు ఉపక్రమించారు డీజీపీ.

Written By:
  • Dharma
  • , Updated On : September 16, 2024 / 10:40 AM IST

    Kadambari Jethwani case

    Follow us on

    Kadambari Jethwani case : ముంబై నటికి వేధింపుల కేసులో ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది.ముంబైలో ఓ పారిశ్రామికవేత్త కుటుంబంఫై కేసు పెట్టిన ముంబై నటిని దారిలోకి తెచ్చుకునేందుకు.. ఏపీలో ఆమెపై వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. తప్పుడు కేసులతో ఆమెను భయపెట్టి.. ముంబైలో పారిశ్రామికవేత్త కుటుంబం పై పెట్టిన కేసును విత్ డ్రా చేయించారు.ఈ మొత్తం ఎపిసోడ్లో వైసీపీ ప్రభుత్వ పెద్దల్లో ఒకరి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.పోలీస్ దిగువ స్థాయి సిబ్బంది నుంచి ముగ్గురు ఐపీఎస్ ల ప్రమేయం ఉన్నట్లు కూడా విమర్శలు వచ్చాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆ కేసు తెరపైకి వచ్చింది. దీంతో ప్రభుత్వం స్పందించింది.అత్యున్నత దర్యాప్తు బృందాన్ని నియమించింది. విచారణ ఒకవైపు కొనసాగుతుండగా.. మరోవైపు అప్పటిపోలీస్ అధికారులపై వేటుపడుతోంది. అందులో భాగంగా తాజాగా ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది.

    ఇప్పటికే ఈ కేసులో క్రియాశీలక పాత్ర పోషించిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పై కేసు నమోదయింది.మొత్తం ముంబై నటి ఎపిసోడ్లో కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ప్రధాన పాత్ర పోషించింది.ముంబైలో పారిశ్రామికవేత్త కుటుంబ సభ్యుడిపై నటి కేసు పెట్టింది.ఆ కేసు విత్ డ్రా చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి పెరిగింది. ఆమె వినకపోయేసరికి ఆ పారిశ్రామికవేత్త నాటి వైసిపి ప్రభుత్వ పెద్దలను కలిశారు. ఆ పెద్దల్లో ఒకరు ఐపీఎస్ అధికారులతో కలిపి వ్యూహం రూపొందించారు. ముంబై నటిని తీసుకొచ్చి తప్పుడు కేసుల్లో ఇరికించారు. రిమాండ్ కు తరలించి కుటుంబ సభ్యులను బెదిరించారు. దీంతో వెనక్కి తగ్గినముంబై నటి నేరుగా విజయవాడ వెళ్లారు. అక్కడకు కొద్ది రోజులకే ముంబైలో కేసును విత్ డ్రా చేసుకున్నారు.

    వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ భూమిని ముంబై నటి అక్రమంగా విక్రయించారన్నది ప్రధాన ఆరోపణ. విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు నటిని అరెస్టు చేసి వేధించారు. అయితే అప్పట్లో భూమినిఅమ్మారని ఇద్దరు నేతలను చూపించారు. కానీ సదరు నటి తమకు భూములు విక్రయించలేదని.. తాజాగా ఆ ఇద్దరు నేతలు ఏకంగా పోలీస్ శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్లాన్ ప్రకారం నటిని ఎలా ఇరికించారో బయటకు తెలిసింది.

    అయితే ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పాత్ర స్పష్టంగా వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ కమిషనర్ గా పనిచేసిన కాంతి రాణా టాటా, డిసిపి విశాల్ గున్నీలపై పాత్ర ఉన్నట్లు డీజీపీలకు నివేదికలు అందాయి. ఈ మేరకు ఆ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేస్తూ జీవో జారీ చేశారు డీజీపీ. ఇదే కేసులో ఇప్పటికే ఎసిపి హనుమంతురావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే.