AP liquor Price : వైసిపి ప్రభుత్వ హయాంలో మద్యం విధానం పై ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి. నాసిరకం బ్రాండ్లను ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని కూటమి నేతలే అప్పట్లో ఆరోపించేవారు. తాము అధికారంలోకి వస్తే మంచి బ్రాండ్లతో పాటు ధర తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో దీనినే ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చారు. కానీ ధరలు మాత్రం తగ్గించడం లేదు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అందుకే కూటమి ప్రభుత్వం మద్యం ధరలపై ఫోకస్ పెట్టింది. ఆయా కంపెనీలతో ధరలు తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వ ఒత్తిడితో ధరలు తగ్గించేందుకు సంబంధిత కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే మూడు కంపెనీల ధరల తగ్గింపు పై ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ప్రధానంగా మాన్షన్ హౌస్, రాయల్ చాలెంజ్, యాంటీక్విటీ కంపెనీలు ధరలు తగ్గించేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఈ మేరకు ధరలు తగ్గిస్తూ కంపెనీలు చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో అమల్లోకి వచ్చాయి. అయితే ఇప్పటికే మద్యం షాపుల్లో ఉన్న పాత స్టాకు పాత ధరలకే విక్రయించనున్నారు. ఈ మూడు కంపెనీలకు సంబంధించి కొత్త స్టాక్ వస్తే ధర తగ్గించి అమ్మనున్నారు. అయితే వీటితో పాటు మరి రెండు కంపెనీలు ధరలు తగ్గించబోతున్నట్లు తెలుస్తోంది.
* అమాంతం పెరిగిన ధర
2019లో టిడిపి ప్రభుత్వం అధికారానికి దూరమయ్యేసరికి మాన్షన్ హౌస్ క్వార్టర్ ధర 110 రూపాయలు ఉండేది. వైసిపి హయాంలో దీనిని 300 రూపాయలకు విక్రయించేవారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో 230 రూపాయలకు అందిస్తూ వచ్చారు. ఇప్పుడు దీనిని కూటమి ప్రభుత్వం 190 రూపాయలకు తగ్గించింది. దీని ఆఫ్ బాటిల్ ధర 440 రూపాయలు ఉండగా 380 కి తగ్గనుంది. ఫుల్ బాటిల్ ధర 870 రూపాయలు నుంచి 760 కి తగ్గనుంది. రాయల్ చాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర 230 నుంచి 210 కి, అదే ఫుల్ బాటిల్ ధర 920 నుంచి 840 కి తగ్గనుంది. యాంటిక్విటీ విస్కీ ఫుల్ బాటిల్ ధర 1600 నుంచి 1400 రూపాయలకు తగ్గనుంది.
* ప్రత్యేక కమిటీ
వాస్తవానికి కూటమి కొత్త మద్యం పాలసీని అమలు చేసింది. అందులో భాగంగా ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చింది. అయితే మద్యం ధరలపై విమర్శలు రావడంతో వీటి సవరణకు ఒక కమిటీని నియమించింది. త్వరలో ఈ కమిటీ అన్ని బ్రాండ్ల కంపెనీలతో ధరల సవరణపై చర్చించనుంది.అందుకు అనుగుణంగా కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.ప్రస్తుతానికి మూడు కంపెనీలు ధరలు తగ్గించాయి.త్వరలో మరో రెండు కంపెనీలు తగ్గించునున్నాయి.మిగతా కంపెనీలు సైతం ధరలు తగ్గించడం అనివార్య పరిస్థితిగా మారింది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ap govt is arranging to reduce quarter bottle rates of popular brands that have reduced liquor prices
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com