AP Government : ఏపీ ప్రభుత్వం( AP government) దూకుడు మీద ఉంది. పాలనాపరమైన కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా కాంట్రాక్టు ఉద్యోగులకు ఊరటనిస్తూ నిర్ణయం తీసుకుంది. వారి సర్వీసును మరో ఏడాది పొడిగించింది. ఆర్థిక శాఖ అనుమతితోనే ఇది సాధ్యమని తేల్చి చెప్పింది. ఈ బీసీ విద్యార్థుల కోసం నిధులు విడుదల చేయడంతో పాటు అమరావతి మెట్రో రైలుకు కూడా నిధులు కేటాయించింది. అయితే ఈ వరుస నిర్ణయాలతో దూకుడు మీద ఉంది కూటమి ప్రభుత్వం. ఈ నిర్ణయం పై కాంట్రాక్టు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : సింహాచలం మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు.. ఇంట్లో ఒకరికి ఉద్యోగం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు!
రాష్ట్రవ్యాప్తంగా చాలా శాఖల్లో కాంట్రాక్టు సిబ్బంది( contract employees) పనిచేస్తున్నారు. వారి సర్వీసును మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో పని చేస్తున్న ఒప్పంద ఉద్యోగుల సేవల గడువు 2025 మార్చి తో ముగిసింది. ఈ నేపథ్యంలో 2026 మార్చి వరకు వారి సర్వీసును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అప్పటివరకు వారు కాంట్రాక్టు ఉద్యోగులుగా కొనసాగునున్నారు. 2006 నుంచి ఇలా కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను ఏటా ప్రభుత్వం పొడిగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా మరో ఏడాది పాటు వారి సేవలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
* ఆ నిబంధన తప్పనిసరి..
సాధారణంగా కాంట్రాక్టు ఉద్యోగుల సేవలు పొడిగింపు సమయంలో ముఖ్యమైన నిబంధన ఒకటి ఉంది. ఆర్థిక శాఖ( finance department) ముందస్తు అనుమతితోనే నియమితులైన కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రమే ఈ పొడిగింపు వర్తిస్తుంది. ఈ నిబంధన పరిధిలోకి రానివారికి ఈ పొడిగింపు వర్తించదు. భవిష్యత్తులో కొత్త కాంట్రాక్టు పద్ధతులు ఉద్యోగులను నియమించుకోవాలంటే.. తప్పనిసరిగా ముందుగా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా కొత్త కాంట్రాక్టు నియామకాలు చేపట్ట రాదు కూడా. ఇప్పుడు దీనినే గుర్తుచేస్తూ ఆర్థిక శాఖ అనుమతి ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును ఏడాది పాటు పొడిగించింది కూటమి ప్రభుత్వం.
* కీలక ప్రాజెక్టులకు నిధులు..
కూటమి ప్రభుత్వం( Alliance government ) మరికొన్ని పథకాలతో పాటు ప్రాజెక్టులకు నిధులు విడుదల చేసింది. ఈ బీసీ విద్యార్థుల అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి రూ.8.75 కోట్ల విడుదలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఈ నిధులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయగా.. తొలి త్రైమాసికానికి సంబంధించి ఈ నిధులు కేటాయించినట్లు పేర్కొంది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ కు బడ్జెట్లో కేటాయించిన 50 కోట్ల రూపాయలను నాలుగు విడతల్లో విడుదలకు ప్రభుత్వం పాలన అనుమతులు ఇచ్చింది.
* మంత్రుల జపాన్ టూర్ కు అనుమతి..
మరోవైపు రాష్ట్ర మంత్రుల జపాన్ పర్యటనకు( Ministers Japan tour) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. జపాన్ పర్యటనకు వెళ్లేందుకు మంత్రుల బృందానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మే 25 నుంచి 31 వరకు జపాన్ లోని ఒసాకలో నిర్వహించనున్న వరల్డ్ ఎక్స్ పో-2025లో పురపాలక శాఖ మంత్రి నారాయణ, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొనున్నారు. ఈ మేరకు వారికి అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. వారు కూడా అర్హులే..