Anganwadi Helper Recruitment: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం( AP government). రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ సహాయకుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంగన్వాడీ కేంద్రాల్లో మరింత మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ కేంద్రాల విషయంలో చాలా రకాల నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4687 మినీ అంగన్వాడీ కేంద్రాలను.. మెయిల్ అంగన్వాడి కేంద్రాలుగా అప్గ్రేట్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తాజాగా అంగన్వాడి కేంద్రాల్లో 4,687 అంగన్వాడి సహాయకుల పోస్టులు భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరితగతిన వీరి నియామకాన్ని చేపట్టాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
* ఇప్పటికే ప్రమోషన్లు..
కూటమి( Alliance) అధికారంలోకి వచ్చిన వెంటనే మినీ అంగన్వాడీ కార్యకర్తలకు ప్రమోషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పాసైన 4,687 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలను.. మెయిల్ అంగన్వాడీ కార్యకర్తలుగా మారుస్తారు. ప్రస్తుతం వీరికి నెలకు రూ.11,500 గౌరవ వేతనం ఇస్తారు. 4678 అంగన్వాడీ సహాయకుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. ఆ నియామకాల ద్వారా అంగన్వాడీ కేంద్రాల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిపై మండలాల వారీగా ఖాళీల ప్రాప్తికి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.
* అర్హతలు ఇవే..
* అంగన్వాడి సహాయకుల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునేవారు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
* వివాహితులు అయ్యి.. స్థానిక వ్యక్తులై ఉండాలి.
* 01 -7- 2025 నాటికి 21 సంవత్సరాలు నిండిన వారు.. లేకుంటే 18 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులు
* ఐటీడీఏ పరిధిలో కేవలం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు.
* అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు కులం, నివాసం, డేట్ అఫ్ బర్త్, పదో తరగతి మార్కుల మెమో, ఆధార్, వైకల్యానికి సంబంధించిన పత్రాలను గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ చేసినవి జతపరచాలి.
* దరఖాస్తులు ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగంలో అతికించాలి. దానిపై సైతం గెజిటెడ్ ధ్రువీకరణ ఉండాలి.
* దరఖాస్తులను స్వయంగా లేదా పోస్ట్ బాక్స్ ద్వారా కూడా అందించవచ్చు.