AP Govt Teachers : ఏపీలో మున్సిపల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారి ప్రమోషన్లకు సంబంధించి ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ పున ప్రారంభించింది.ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులైన సెకండరీ గ్రేడ్ టీచర్ల జాబితాను అధికారులు ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. ఈరోజు సాయంత్రం లోపు అభ్యంతరాలు ఉంటే తెలపాలని అన్ని జిల్లాల డీఈవోలు ఆదేశాలు జారీ చేశారు.మొత్తానికైతే మున్సిపల్ స్కూల్ లలో టీచర్లకు తీపి కబురు అందినట్టే. అయితే మున్సిపల్ ఉపాధ్యాయుల విషయంలో ఇప్పటికే ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఆ పాఠశాలల్లో కారుణ్య నియామకాలకు సైతం లైన్ క్లియర్ చేసింది. ఇప్పుడు ఏకంగా ప్రమోషన్ ఇస్తూ నిర్ణయం తీసుకోవడంతో మున్సిపల్ ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
* గురుకులాలకు నిధులు
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2114 పురపాలక పాఠశాలల్లో టీచర్ల ప్రమోషన్లకు సంబంధించి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇందుకు సంబంధించి ఉత్తర్వు కూడా జారీ చేసింది.మరోవైపు రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకులాలకు సంబంధించి ప్రభుత్వం మరో ఉత్తర్వులు జారీచేసింది. గురుకులాల్లో మరమ్మత్తులు, నిర్వహణ ఖర్చులకోసం రూ. 7.81 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతోనే సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఫ్లోరింగ్,స్లాబ్,విద్యుత్,మరుగుదొడ్లు,తాగునీటి పైపులు,తలుపులు, కిటికీలకు మరమ్మత్తులు చేపడతారు.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 73 గురుకులాల్లో ఈ సమస్యలు ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం.. వెనువెంటనే పనులు చేపట్టేందుకు 7.81 కోట్లు విడుదల చేసింది.
* ప్రత్యేక ఉత్తర్వులు
మున్సిపల్ పాఠశాలలకు సంబంధించి చాలా ఏళ్లుగా సమస్యలు ఉన్నాయి.ముఖ్యంగాఅక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు,ప్రమోషన్లు చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నాయి. వాటిని ఇప్పుడు సరి చేసే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోట్ చేయాలని భావిస్తోంది. అందుకే వెనువెంటనే ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తానికి అయితే ఏపీలో మున్సిపల్ టీచర్లకు కొత్త సంవత్సరం బహుమతి ఇచ్చినట్టే. వారి కోసమే పాఠశాల విద్యాశాఖ ఈ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.