spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh Gold Mines: ఏపీకి బంగారం లాంటి వార్త!

Andhra Pradesh Gold Mines: ఏపీకి బంగారం లాంటి వార్త!

Andhra Pradesh Gold Mines: జాతీయస్థాయిలో ఏపీ భరోసారీ ప్రత్యేక గుర్తింపు పొందింది.’గోల్డెన్’ ఛాన్స్ దక్కించుకుంది.. రాయలసీమలో మరో జిల్లాలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్య వహిస్తున్న చిత్తూరులో భారీగా నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం చిగురు గుంట బి సానత్తం లో బంగారు గనులపై దృష్టి సారించింది. ఈ బంగారు నిక్షేపాలను దక్కించుకునేందుకు నిర్వహించే వేలంలో పాల్గొనాలని భావిస్తోంది. మరోవైపు వేలం లేకుండా ఈ గనులను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు కేటాయించేలా చూడాలని కేంద్రాన్ని కోరే అవకాశం కూడా ఉంది. ఈ బంగారు గనులను దక్కించుకుంటే ఎంతో మేలు జరగనుంది రాష్ట్రానికి. ఇక్కడ ఏకంగా 22 లక్షల టన్నుల బంగారం ఖనిజాలు ఉన్నట్లు గుర్తించారు. ఒక టన్ను ఖనిజాన్ని శుద్ధి చేస్తే ఐదు పాయింట్ 64 గ్రాముల వరకు బంగారం సేకరించవచ్చని చెబుతున్నారు.

* భారీగా బంగారం వచ్చే ఛాన్స్..
తాజాగా గుర్తించిన ఈ బంగారం నిక్షేపంలో.. కనుజాన్ని వెలికి తీస్తే 12,500 కిలోల బంగారం వస్తుందని చెబుతున్నారు. గతంలో ఈ ప్రాంతంలో ఖనిజాన్ని బయటకు తీసి కొంత శుద్ధి చేసి అక్కడి నుంచి సమీపంలో ఉన్న కర్ణాటక కోలార్ గోల్డ్ మైన్స్ దగ్గరకు తరలించేవారు. అక్కడ ఖనిజాన్ని శుద్ధి చేసి బంగారాన్ని సేకరించేవారు. అయితే అప్పట్లో తవ్వకాలతో పాటు తరలింపునకు భారీగా ఖర్చు జరిగింది. అందుకే తవ్వకాలను నిలిపివేశారు. 2000లో గనులను మూసివేశారు. 2018లో మరోసారి వేలం నిర్వహించగా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఈ గనులను దక్కించుకుంది. కోర్టు కేసుల కారణంగా తరువాత చర్యలు ప్రారంభం కాలేదు.

* ఇటీవల కర్నూలులో..
ఇటీవల కర్నూలు జిల్లాలో బంగారు గనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. జొన్నగిరి మండలంలో గనులు ప్రారంభం అయ్యాయి. అందుకే తాజాగా సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో గనులపై ఖనిజాభివృద్ధి సంస్థ దృష్టి పెట్టింది. అందుకే వేలంలో పాల్గొనాలని భావిస్తోంది. ఎప్పటికీ 37 కోట్ల బ్యాంకు గ్యారంటీ కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. వేలంలో బిడ్డ ఏదైనా సంస్థతో కలిపి బంగారం తవ్వకాలు జరిపే ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Oktelugu Epaper
Exit mobile version