AP First Coffee Park: విశాఖ పై( Visakhapatnam) దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. విశాఖ నగరం తో పాటు మన్య ప్రాంతం పై ఫోకస్ చేసింది. ముఖ్యంగా అరకు కాఫీకి అంతర్జాతీయంగా మరింత గుర్తింపు తీసుకొచ్చి.. మార్కెట్ ను విస్తరించేందుకు ఏపీ ప్రభుత్వం మంచి ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో.. అరకు కాఫీ బ్రాండింగ్ కోసం టాటా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మరోవైపు రాష్ట్రంలోనే తొలిసారి కాఫీ పార్కును ఏర్పాటు చేయడానికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది నర్సీపట్నం కేంద్రంగా ఏర్పాటు కానుంది. పంట నుంచి కాఫీ తాగే కప్పు వరకు అన్ని ఒకే ప్రదేశంలో ఉత్పత్తి చేసే స్థాయిలో ఈ పార్కు అందుబాటులోకి రానుంది.
Also Read: నేటి నుంచి ‘ఆడుదాం ఆంధ్ర’ ఆట.. కీలక అరెస్టులు!
నర్సీపట్నంలో ఏర్పాటు.. నర్సీపట్నం( Narsipatnam ) గిరిజన ప్రాంతానికి ముఖ ద్వారం గా ఉంటుంది. అందుకే అక్కడ కాఫీ శుద్ధి ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని గిరిజన సహకార సంస్థ అధికారులు ప్రయత్నించారు. గతంలో డౌనూరులో నిర్మాణానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం గిరిజన ఉత్పత్తులపై దృష్టి సారించిన నేపథ్యంలో.. నర్సీపట్నంలో కొత్తగా కాఫీ పార్కు ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికే దీనిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఆ విన్నపం మేరకు సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. మాక వారి పాలెం లోని శెట్టిపాలెం గ్రామ సమీపంలో ఈ పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఆదివారం వర్చువల్గా శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. సెప్టెంబర్ 1 నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పార్కు ఏర్పాటు ద్వారా 200 మందికి ఉపాధి లభిస్తుంది. దీనిపై గిరిజనుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
మన్యంలో విస్తారంగా సాగు..
అరకు కాఫీకి ( Araku coffee )ఎనలేని ప్రాధాన్యం పెరుగుతోంది. జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఇటీవలే పార్లమెంటులోనూ అరకు కాఫీ స్టాల్ ప్రారంభం అయింది. పాడేరు ఏజెన్సీలోని 10 మండలాల్లో కాఫీ విస్తారంగా సాగు అవుతుంది. అయితే కాఫీ గింజలు శుద్ధి కోసం ప్రస్తుతం నర్సీపట్నంలోని ఏపీ ఎఫ్డిసి కేంద్రం పై జిసిసి ఆధారపడుతోంది. ఫిల్టర్ కాఫీ కోసం అయితే బెంగళూరుకు వెళ్లాల్సి వస్తోంది. ఇకపై అటువంటి ఇబ్బందులు ఉండవు. కాఫీ పార్కులోనే అంతర్జాతీయ ప్రమాణాలతో గింజలు శుద్ధి చేసి.. పొడి తయారు చేయనున్నారు. విదేశాలకు సైతం ఎగుమతి చేయనున్నారు.
Also Read: ఏపీకి మరో హెచ్చరిక!
కేంద్ర సాయం..
కాఫీ పార్కు( coffee Park) ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించనుంది. ఇందుకోసం రూ.10 కోట్లు మంజూరు చేసింది. తోటల నుంచి సేకరించిన గింజలను ఆరబెట్టెందుకు యార్డులు, నిల్వచేయడానికి గోడౌన్లు, రోస్టింగ్, గ్రైండింగ్, బ్లైండింగ్, ప్యాకింగ్ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. అత్యాధునిక యంత్రాలు, ఆటోమేటిక్ విధానంలో ఈ ప్రక్రియ కొనసాగనుంది. కాఫీ కప్ టెస్ట్ పేరిట ప్రత్యేక రీసెర్చ్, డెవలప్మెంట్ ల్యాబ్ కూడా ఇక్కడ ఏర్పాటు కానుంది. మొత్తానికి అయితే విశాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది.