AP Farmers News: ఏపీ ప్రభుత్వం( AP government) రైతులకు సాగు ప్రోత్సాహం కింద అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఈ పథకాన్ని అమలు చేసింది ప్రభుత్వం. ఈనెల 2న కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ రూ.2000తో పాటు అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.5000 అందించింది. రైతుల ఖాతాల్లో రూ.7000 చొప్పున జమ అయ్యింది. కానీ కొన్ని జిల్లాల రైతుల ఖాతాల్లో నిధులు జమ కాలేదు. స్థానిక సంస్థలకు సంబంధించి ఉప ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా కొన్ని జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అందుకే అప్పట్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ కాలేదు. తాజాగా అటువంటి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది ఏపీ ప్రభుత్వం.
Also Read: చంద్రబాబుకు రూ.కోటి రాఖీ కట్టిన మహిళా నేత.. నిజం ఎంత?!
ఈనెల 2న శ్రీకారం
తాము అధికారంలోకి వస్తే ఏటా రైతులకు సాగు ప్రోత్సాహం కింద కేంద్రంతో కలిపి 20 వేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు( CM Chandrababu) హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాల్లో చేర్చారు. అందుకు తగ్గట్టుగానే ఈ ఏడాది నుంచి అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.14000 అందించేందుకు నిర్ణయించారు. కేంద్రం అందించే పీఎం కిసాన్ నిధులు 6000 రూపాయలతో కలిపి ఏడాదికి అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం ఏడాదిలో మూడుసార్లు రెండు వేల రూపాయల చొప్పున అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం అన్నదాత సుఖీభవ కింద మూడు విడతల్లో రూ.14000 అందించనుంది. ఈనెల రెండున అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేశారు సీఎం చంద్రబాబు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో పథకానికి శ్రీకారం చుట్టారు. అయితే ఆ సమయంలో ఎన్నికల కోడ్ ఉంది కొన్ని జిల్లాలకు. ఆ ప్రాంతాలకు మినహా రాష్ట్రవ్యాప్తంగా 44.75 లక్షల మంది రైతులకు రూ.5000 చొప్పున జమ చేశారు. వివిధ కారణాలతో అన్నదాత సుఖీభవ పడని వారికి సైతం సమయం ఇచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. అటువంటి వారి ఖాతాల్లో సైతం నిధులు జమయ్యాయి.
Also Read: ఏపీలో పాలన.. చంద్రబాబు, జగన్ మధ్య తేడా అదే!
ఎలక్షన్ కోడ్ కారణంగా..
అప్పట్లో ఎన్నికల కోడ్( election code) కారణంగా అన్నదాత సుఖీభవ నిధులు జమ కాని వారికి.. తాజాగా ప్రభుత్వం జమ చేసింది. బుధవారం రూ.71.38 కోట్లను విడుదల చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు. 1,42 765 మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. అయితే అప్పట్లో వివిధ కారణాలతో 1,21,422 మంది రైతులకు వివిధ సాంకేతిక కారణాలతో అన్నదాత సుఖీభవ దక్కలేదు. అటువంటి వారికి మరోసారి ఛాన్స్ ఇచ్చారు. సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే అందులో 38,658 మంది మాత్రమే క్రమబద్ధీకరించుకున్నారు. ప్రధానంగా మ్యాపింగ్ లేకపోవడంతో చాలామందికి అన్నదాత సుఖీభవ దక్కలేదు. అటువంటి వారంతా సరి చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.