Nara Lokesh Australia Tour: జాతీయస్థాయిలో ఇప్పుడు నారా లోకేష్( Nara Lokesh) ఒక ప్రముఖ వ్యక్తిగా మారిపోయారు. ఆయన పర్యటనలకు ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్నారు. అయితే ఈరోజు నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్నారు. ఆరు రోజులపాటు ఆస్ట్రేలియాలో ఉండనున్నారు. నవంబర్లో విశాఖలో పెట్టుబడుల సదస్సు జరగనుంది. ఇప్పటికే వివిధ దేశాలు వెళ్లి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు లోకేష్. ఇప్పుడు ఆస్ట్రేలియా వెళుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. స్పెషల్ విజిట్ ప్రోగ్రాంలో భాగంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆహ్వానించిన సంగతి తెలిసిందే. గతంలో ఇలాగే సీఎంగా నరేంద్ర మోడీ ఉన్న సమయంలోనే ఆస్ట్రేలియా ఆహ్వానించింది. ఇప్పుడు నారా లోకేష్ ను ఆహ్వానించడం గొప్ప అవకాశం గా తెలుస్తోంది.
* కీలక మంత్రిత్వ శాఖలు..
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు లోకేష్. కీలక ఐటి శాఖతోపాటు మానవ వనరుల అభివృద్ధి, పాఠశాల విద్యా శాఖను నిర్వర్తిస్తున్నారు. మానవ వనరులు, సాంకేతిక, ఆర్థిక అభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. ఈ మేరకు స్పెషల్ విజిట్ ప్రోగ్రాంలో భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేష్ ను కోరింది. అందులో భాగంగా మంత్రి లోకేష్ ఈ నెల 19 నుంచి 24 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. పనిలో పనిగా విశాఖలో పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు.
* ఆరు రోజులపాటు..
ఆరు రోజులపాటు లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన కొనసాగనుంది. అక్కడ వివిధ యూనివర్సిటీలను సందర్శించి మధునాతన విద్యా విధానాలపై అధ్యయనం చేస్తారు. అక్కడి పారిశ్రామికవేత్తలతో రోడ్ షోలో పాల్గొంటారు.
* ఈరోజు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొంటారు.
* 20న ఎంఎస్డబ్ల్యూ పార్లమెంట్ హౌస్ ఆవరణలో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో నిర్వహించే సిఐఐ పార్ట్నర్ షిప్ సమ్మిట్ రోడ్డు షో లో పాల్గొంటారు.
* 23న ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వైన్ ఇండస్ట్రీని సందర్శిస్తారు. అక్కడి ట్రెజరీ వైన్స్ ఎస్టేట్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు.
* 24న మెల్బోర్న్ నుంచి బయలుదేరి 25 రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు.