AP Elections Results 2024 : జనసేన సీట్లలో సగం కూడా లేవా… జగన్ కి మరీ ఇంత అవమానమా!

AP Elections Results 2024 : పోటీ చేసిన చోట్ల గెలుపొందామా? లేదా? అన్నదే ముఖ్యమని జనసైనికులు కామెంట్స్ చేస్తున్నారు. కానీ దానికి రిప్లై ఇచ్చేందుకు కూడా వైసీపీ శ్రేణులు ముందుకు రావడం లేదు.

Written By: NARESH, Updated On : June 4, 2024 8:22 pm

ys jagan pawan kalyan

Follow us on

AP Elections Results 2024 :  కాలం ఒకేలా ఉండదు. ఎప్పటికప్పుడు తారుమారు అవుతుంది. అందునా రాజకీయంలో అయితే మరి స్పీడ్ గా ఉంటుంది. ఒకసారి విజయం దక్కితే.. మరోసారి అపజయం తప్పదు. అయితే గెలుపోటములను సమానంగా తీసుకుంటేనే రాజకీయాల్లో రాణించగలం. కొద్ది కాలాలపాటు కొనసాగగలం. అయితే జనసేన ఆవిర్భవించి సరైన విజయం దక్కలేదు ఇంతవరకు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ఓడిపోయారు. జనసేన నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యేను వైసిపి లాగేసుకుంది. అయితే ఇప్పుడు అదే వైసిపి జనసేన కంటే తక్కువ ఓట్లు సాధించడం విశేషం.

గత ఎన్నికల్లో 151 స్థానాల్లో వైసిపి విజయం సాధించింది. అప్పట్లో 135 నియోజకవర్గాల్లో పోటీ చేసిన జనసేన ఒక స్థానంతో సరిపెట్టుకుంది. అటు పవన్ సైతం ఓడిపోవడంతో.. వైసీపీ శ్రేణులు గత ఐదు సంవత్సరాలుగా జనసేన ను టార్గెట్ చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ను ఒక ఫెయిల్యూర్ నాయకుడిగా చూపే ప్రయత్నం చేశాయి. కానీ ఇప్పుడు సీన్ మారింది. వైసిపి పోటీ చేసిన 175 నియోజకవర్గాల్లో 9 చోట్ల విజయం సాధించింది. ఒకచోట మాత్రం విజయం దోబూతులాడుతోంది. అయితే 21 చోట్ల పోటీ చేసిన జనసేన అన్ని స్థానాల్లో విజయం సాధించింది. దీంతో జనసేన గెలిచిన సగం నియోజకవర్గాల్లో.. వైసిపి గెలిచినట్లు అయింది. పది స్థానాలు దక్కడంతో ప్రధాన ప్రతిపక్ష హోదా వైసిపికి దక్కదు.

అయితే ఇంతటి దారుణ పరాజయం ఎవరికీ దక్కలేదు. గత ఎన్నికల్లో జనసేన ది దారుణ పరాజయమే. కానీ అదే పనిగా పవన్ కళ్యాణ్ వెంటాడింది వైసిపి. రెండు చోట్ల ఓడిపోయాడు, అన్నిచోట్ల పోటీ చేయలేడు, ఆయన ఒక నాయకుడేనా? అన్న కామెంట్స్ బలంగా వైసీపీ నుంచి వినిపించేవి. కానీ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన వైసీపీకి దక్కింది కేవలం పది స్థానాలే. జనసేన పోటీ చేసింది 21 నియోజకవర్గాల్లో. కానీ అన్ని స్థానాల్లో గెలిచి సత్తా చాటింది జనసేన. అందుకే జనసేన శ్రేణులు ఒక రకమైన కామెంట్స్ చేస్తున్నాయి.ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నామన్నది ముఖ్యం కాదు.. పోటీ చేసిన చోట్ల గెలుపొందామా? లేదా? అన్నదే ముఖ్యమని జనసైనికులు కామెంట్స్ చేస్తున్నారు. కానీ దానికి రిప్లై ఇచ్చేందుకు కూడా వైసీపీ శ్రేణులు ముందుకు రావడం లేదు.