Homeఆంధ్రప్రదేశ్‌AP DWCRA Women Latest Benefits: ఏపీలో డ్వాక్రా మహిళలకు మరో గుడ్ న్యూస్!

AP DWCRA Women Latest Benefits: ఏపీలో డ్వాక్రా మహిళలకు మరో గుడ్ న్యూస్!

AP DWCRA Women Latest Benefits: ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. ఎలాంటి పూచి కత్తు లేకుండా 10 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత రుణం అందించనుంది. డ్వాక్రా మహిళలు ఎం ఎస్ ఎం ఈ యూనిట్లు ఏర్పాటు చేసుకునే వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. సెర్ఫ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దీన్ దయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం కింద ఈ రుణాన్ని అందించనున్నారు. ఈ రుణం తీసుకునేందుకు డ్వాక్రా మహిళలకు ఎలాంటి పూచికత్తు అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఐఈఎల్ఏ విధానాన్ని తీసుకొచ్చింది. ఏపీలో డ్వాక్రా మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు.

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు..
ప్రభుత్వం ఎం ఎస్ ఎం ఈ యూనిట్లు కోసం రుణాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించి మునగ, తేనె, పుట్టగొడుగుల ఉత్పత్తి, నర్సరీలు, సోలార్ డ్రైయర్లు, రక్షిత సాగు, చేపలు వంటి యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం దీన్ దయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం కింద ఈ యూనిట్ లను అందించనుంది. సెర్ఫ్ శాఖలోని వెలుగు విభాగం అధికారులు ఈ యూనిట్లకు సంబంధించిన డీపీఆర్ తయారీ, దరఖాస్తుల్లో సహకారం అందిస్తారు.

చిన్న తరహా పరిశ్రమలకు..
రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఐపీఓ లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పటికే దీనిపై టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఇటీవల ఎంఎస్ఎమ్ఈలకు సంస్థాగత రుణాలు కూడా తిరిగాయి. డ్వాక్రా మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు వీలుగా.. వారికి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వీలుగా అనేక పథకాలను ప్రవేశపెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు దానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తోడు కావడంతో.. మహిళలకు మరిన్ని ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular