Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Birthday: ఆ నగరంలో గల్లీ బాయ్ గా పవన్ కళ్యాణ్!

Pawan Kalyan Birthday: ఆ నగరంలో గల్లీ బాయ్ గా పవన్ కళ్యాణ్!

Pawan Kalyan Birthday: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు( AP deputy CM Pawan Kalyan ) విశాఖ నగరంతో ఎంతో అనుబంధం ఉంది. సినీ రంగంలో టర్నింగ్ పాయింట్ కు విశాఖపట్నం. రాజకీయాల్లో మార్గదర్శకం చేసింది కూడా ఇదే నగరం. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎక్కువగా విశాఖ నగరాన్ని ఇష్టపడడానికి అవే కారణాలు. ఇప్పటి సినిమా హీరోల మాదిరిగా పవన్ కళ్యాణ్ 20 ఏళ్లకే సినిమాల్లోకి రాలేదు. అసలు ఆయన సినిమా రంగంలోకి వచ్చే ఛాన్స్ లేదు. కానీ పవన్ కళ్యాణ్ కు విశాఖ నగరం సినిమాలకు అవకాశం కల్పించింది. అలా సినిమా ఛాన్సుల కోసమే విశాఖ నగరానికి వచ్చిన పవన్ కళ్యాణ్ కు చాలా అనుబంధం ఏర్పడింది. విశాఖ నగరంలో ప్రతి గల్లీ పవన్ కళ్యాణ్ కు తెలుసు. అంత అనుబంధం ఆయనది.

Also Read: ఈ వయసులో అంబటి రాంబాబు.. వైరల్ వీడియో

* నటనలో శిక్షణ..
సోదరుడు చిరంజీవి( megastar Chiranjeevi) సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్. మరో సోదరుడు నాగబాబు నిర్మాతగా ఉన్నారు. మరోవైపు ఆర్టిస్టుగా కూడా రాణిస్తున్నారు. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ సినిమా ఎంట్రీ ఆలోచన చిరంజీవి భార్యది. అయితే అప్పటికే సిగ్గు, బిడియంతో ఉండేవారు పవన్ కళ్యాణ్. అందుకే యాక్టింగ్ లో శిక్షణ ఇప్పించాలని చిరంజీవి భావించారు. విశాఖ నగరంలో సత్యానంద్ దగ్గర శిక్షణ తీసుకున్న చాలామంది హీరోలు సినిమా రంగంలో రాణించారు. అలా పవన్ కళ్యాణ్ విశాఖ నగరంలో అడుగు పెట్టారు. సంగం-శరత్ థియేటర్ల ప్రాంతంలో అప్పట్లో ఉండేవారు. అలా సత్యానంద్ శిక్షణ లో రాటు తేలిన పవన్ అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. తొలి సినిమాతో మెగాస్టార్ సోదరుడు గా పరిచయమైన పవన్.. తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. సినిమాల జయప జయాలతో పని లేకుండా.. తనకంటూ ఒక స్టార్ డం ఏర్పాటు చేసుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ గా ఎదిగారు. అయితే తనకు నటుడిగా అవకాశం ఇచ్చింది విశాఖ నగరం అని సగర్వంగా చెబుతుంటారు పవన్.

* రాజకీయంగా టర్నింగ్ పాయింట్..
రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ కు మార్గదర్శకం చేసింది విశాఖ( Visakhapatnam) నగరం. 2019 ఎన్నికల్లో తొలిసారిగా బరిలో దిగింది జనసేన పార్టీ. అప్పుడే పవన్ కళ్యాణ్ గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అక్కడ త్రిముఖ పోటీలో రెండో స్థానంలో నిలిచారు. ఓటమి చవిచూసినా నియోజకవర్గ ప్రజలకు పల్లెత్తు మాట అనలేదు. పైగా విశాఖ నగరం పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. విశాఖ ప్రజలకు చాలా సార్లు అండగా నిలిచారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ పర్యటనకు వస్తే వైసిపి ప్రభుత్వం మూడు రోజులపాటు నిర్బంధించింది. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ రాజకీయంగా మరింత రాటుదేలారు. రాజకీయంగా బలమైన ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఉభయగోదావరి జిల్లాల కంటే విశాఖలోనే పవన్ అభిమానులు ఎక్కువ. పవన్ వ్యక్తిత్వాన్ని సమర్థించే వారు ఎక్కువ. అందుకే విశాఖపట్నం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్. జనసేన తరఫున ఎక్కువమంది ఎమ్మెల్యేలు అయ్యారు కూడా ఈ జిల్లాల నుంచే. పార్టీ ఎటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టినా విశాఖని ఎంపిక చేసుకుంటారు. సినీ రంగంతో పాటు రాజకీయ రంగాల్లో గుర్తింపు తీసుకొచ్చింది విశాఖ అని సగర్వంగా చెబుతుంటారు. తాజాగా సేనతో సేనాని పేరిట పార్టీ విస్తృతస్థాయి సమావేశాలు కూడా విశాఖ నగరంలోనే నిర్వహించారు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ విశాఖ తో ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. మూడు దశాబ్దాల కిందట నాటిది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular