Ambati Rambabu: వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంబటి రాంబాబు మాట్లాడిన ప్రతి మాట మీడియాలో సంచలనంగా ఉండేది. ఇక సోషల్ మీడియాలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంబటి రాంబాబు వేసిన స్టెప్పులు అప్పట్లో మీడియాను, సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఓ నీ టిపారుదల ప్రాజెక్టుపై ఆయన మాట్లాడిన మాటలు కూడా అదే స్థాయిలో రచ్చకు కారణమయ్యాయి. ఇప్పుడు అధికారం కోల్పోవడం.. ఎన్నికల్లో ఓడిపోవడంతో అంబటి రాంబాబు సొంత మీడియాలో తప్ప మిగతా మీడియాలో అంతగా ప్రాధాన్యం లభించడం లేదు. అయినప్పటికీ ఆయన ఊరుకోవడం లేదు. తనదైన శైలిలో ప్రభుత్వం పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. సంచలన విషయాలను వెల్లడిస్తూనే ఉన్నారు.
Also Read: కవితకు “సోషల్” బలం కావాల్సిందే
అంబటి రాంబాబు విమర్శలతోనే కాదు తన చేష్టలతో కూడా మీడియాలో సంచలమైన వ్యక్తిగా ఉంటారు. ఆరుపదుల వయసుకు దగ్గరగా వచ్చినప్పటికీ అంబటి రాంబాబు శారీరక సామర్థ్యం లో ఇప్పటికీ ఫిట్ గానే ఉంటారు. దానిని నిరూపించుకునే ప్రయత్నాన్ని అంబటి రాంబాబు చేశారు. దానికి సంబంధించిన వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ట్రెక్కింగ్ చేస్తూ అంబటి రాంబాబు కనిపించారు. ట్రెక్కింగ్ అనంతరం రకరకాల విన్యాసాలు చేశారు. వాస్తవానికి అంతటి కఠినమైన కొండ ప్రాంతాన్ని ఎక్కడం అంత సులభం కాదు.. పైగా ఆ ప్రాంతం మొత్తం అత్యంత కఠినంగా ఉంది. అయినప్పటికీ ఏమాత్రం భయపడకుండా రాంబాబు అక్కడిదాకా వెళ్లారు. అక్కడికి వెళ్లి ఊరుకోకుండా రకరకాల విన్యాసాలు చేశారు.
ట్రెక్కింగ్ వల్ల రాంబాబు మానసిక ప్రశాంతత పొందారని వైసీపీ నేతలు అంటున్నారు. ఎంతటి కఠినమైన పరిస్థితిలో ఉన్నా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదని రాంబాబు నిరూపించారని.. ఆయన రాజకీయ ప్రయాణం కూడా ఇలానే సాగిందని ఉదహరిస్తున్నారు. “ఆయన మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ అభిమాని. వైయస్ కన్నుమూసిన తర్వాత జగన్ తో తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ రాంబాబు జగన్ చేయి విడవలేదు. అందువల్లే రాంబాబు అంటే జగన్ కు విపరీతమైన నమ్మకం. ఆ నమ్మకం ఇప్పటివరకు విజయవంతంగా కొనసాగుతూ ఉందని” వైసీపీ నేతలు అంటున్నారు. రాంబాబు వీడియోలో ఒక యోధుడి లాగా కనిపిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.
సంకల్పం ఉంటే వయసు పెద్ద సమస్య కాదు అని Ambati Rambabu గారు నిరూపించారు జయహో.. pic.twitter.com/UrrzLtyj2Z
— Bhaskar Reddy (@chicagobachi) September 1, 2025