AP Government: వందల అడుగుల్లో జలం( storage water). దానిని భూమిపైకి తేవాలంటే భగీరథ ప్రయత్నం అవసరం. కానీ ఆ రైతు చాలా రకాలుగా ప్రయత్నించి విసిగి వేసారి పోయాడు. కానీ సాధ్యం కాకపోవడంతో కుటుంబంతో పాటు ఆత్మహత్య శరణ్యమని భావించాడు. చివరి ప్రయత్నం గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. అది చూసినవారు ఓ చోటకు వెళితే పరిష్కారం దొరుకుతుందని చెప్పుకొచ్చారు. వెంటనే సదరు రైతు ఆ చోటకు వెళ్లారు. గంటల వ్యవధిలో పరిష్కార మార్గం దొరికింది. రోజుల వ్యవధిలోనే సమస్య పరిష్కారం అయ్యింది. ఆ రైతు కళ్ళల్లో ఆనందం వచ్చింది. అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది ఈ ఘటన.
ఇది ఉత్తరాంధ్ర కాదు.. రాయలసీమ.. అనంతపురం.. సింగనమల నియోజకవర్గం..
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండలం వెంకటాపల్లి గ్రామానికి చెందిన రైతు కొరకుటి శ్రీనివాసులు గారి దానిమ్మ తోట ఎండిపోతుంది… ఆత్మహత్య వరకు వెళ్ళింది.. కరెంట్ రానీయడం లేదు లోకల్లో అని..
మొన్న ఆయన… pic.twitter.com/WFA3RtUZi3
— మన ప్రకాశం (@mana_Prakasam) February 13, 2025
* భగీరథ ప్రయత్నం
అనంతపురం జిల్లా( Ananthapuram district) సింగనమల నియోజకవర్గం నార్పల మండలం వెంకటా పల్లి గ్రామానికి చెందిన కొరుకుటి శ్రీనివాసులు( Srinivasulu ) ఒక సామాన్య రైతు. తనకు 11 ఎకరాల పొలం ఉంది. అందులో దానిమ్మ పంట వేసుకున్నారు శ్రీనివాసులు. కానీ సాగునీరు లేక పంట ఎండిపోతోంది. పొలంలో 48 సార్లు బోరు తవ్వారు. కానీ ఒక్కచోట కూడా నీరు పడలేదు. చివరిసారిగా ఇంటి సమీపంలో బోరువేస్తే పుష్కలంగా నీరు దొరికింది. దీంతో శ్రీనివాసులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే మంజూరు కానీ పరిస్థితి. అడుగడుగునా అడ్డంకులు. ఆపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు. దీంతో మోటారుకు విద్యుత్ కనెక్షన్ రాక.. నీరు లేక దానిమ్మ పంట ఎండిపోయింది. ఇటువంటి తరుణంలో తన కుటుంబానికి ఆత్మహత్య శరణ్యమని బాధిత రైతు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. అది విపరీతంగా వైరల్ అయింది. తెలుగుదేశం పార్టీ నేతలను కదిలించింది.
* వెనువెంటనే పరిష్కారం
స్థానిక టిడిపి నాయకులు( TDP leaders) బాధిత రైతు శ్రీనివాసులను ఆశ్రయించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వేదిక జరుగుతోంది. అక్కడ మంత్రులు వినతులు స్వీకరిస్తారు. అక్కడికి వెళ్లి విన్నవించండి అంటూ సలహా ఇచ్చారు. దీంతో శ్రీనివాసులు టిడిపి కేంద్ర కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తో పాటు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి ఆ వినతిని చూశారు. వెంటనే కలెక్టర్ తో మాట్లాడారు. అక్కడికి నాలుగు రోజులకే ఆ రైతు వ్యవసాయ మోటారుకు విద్యుత్ కనెక్షన్ వచ్చింది. బాధిత రైతు శ్రీనివాసుల కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
* ఆత్మహత్యకు ప్రణాళిక
టిడిపి కేంద్ర కార్యాలయానికి( TDP central office) వెళ్లిన బాధిత రైతు శ్రీనివాసులు అక్కడ పని కాకుంటే.. అటు నుంచి అటే పొలంలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ సమస్య నాలుగు రోజుల్లో పరిష్కారం కావడం.. మోటారు నుంచి నీరు బయటకు వచ్చి పంటను తడపడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అందుకే ఆ కృతజ్ఞతతో పొలంలోని బోరు వద్ద సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, గండి బాబ్జి ఫోటోలను పెట్టి.. మోటార్ను ప్రారంభించాడు. తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
* మంత్రి కొండపల్లి పై అభిమానం
అయితే ప్రధానంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఫోటో పెట్టుకున్నారు రైతు శ్రీనివాసులు. ఇలా తన విన్నపానికి వెంటనే మంత్రి స్పందించారని.. అనంతపురం జిల్లా కలెక్టర్ తో మాట్లాడారని.. విద్యుత్ శాఖ సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టి.. విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేశారని గుర్తు చేస్తున్నాడు సదరు రైతు శ్రీనివాసులు. తనలో శ్వాస ఉన్నంతవరకు మంత్రి శ్రీనివాసును గుర్తుపెట్టుకుంటానని చెబుతున్నాడు. ప్రధానంగా మంత్రి శ్రీనివాస్ ఫోటోను విద్యుత్ మోటార్ వద్ద పెట్టి ప్రారంభోత్సవం చేసి.. తనలో ఉన్న కృతజ్ఞతా భావం చాటుకున్నాడు సదరు రైతు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతోంది.