Orange and Laila : ఫిబ్రవరి 14 వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా టాలీవుడ్ లో కొన్ని చిత్రాలు విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్(Vishwak Sen) హీరో గా నటించిన ‘లైలా(Laila Movie)’ చిత్రంతో పాటు, బ్రహ్మానందం(Bramhanandam), ఆయన కొడుకు ప్రధాన పాత్రలు పోషించిన ‘బ్రహ్మ ఆనందం’ అనే చిత్రం కూడా విడుదల అవుతుంది. ఈ రెండు సినిమాల్లో విశ్వక్ సేన్ లైలా కి యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. అంతే కాకుండా నిత్యం సోషల్ మీడియా లో ఈ సినిమా పై కాంట్రవర్సిలు ఎక్కువగా నడుస్తుండడం వల్ల, లైలా పేరు ట్రెండింగ్ లోనే ఉంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలతో పాటు రామ్ చరణ్(Ram Charan) కెరీర్ లో డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలిన ‘ఆరెంజ్(Orange)’ చిత్రం కూడా ఫిబ్రవరి 14 న రీ రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా క్రేజ్ కొత్త సినిమాలను ఒక రేంజ్ లో డామినేట్ చేయడం గమనార్హం.
2023 వ సంవత్సరం లో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆరెంజ్’ చిత్రాన్ని విడుదల చేయగా, దానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఒక ఫ్లాప్ సినిమాకి ఇంతటి బంపర్ రెస్పాన్స్ వస్తుందని రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఊహించలేదు. ఈ సినిమాలోని పాటలకు అభిమానులు ఒక రేంజ్ లో థియేటర్స్ వద్ద ఎంజాయ్ చేసారు. కేవలం వీకెండ్స్ లో మాత్రమే రీ రిలీజ్ చిత్రాలకు కలెక్షన్స్ వస్తుంటాయి. కానీ ఆరెంజ్ చిత్రానికి వర్కింగ్ డేస్ లో కూడా భారీ వసూళ్లు వచ్చాయి. కాలేజీ స్టూడెంట్స్ ఈ రీ రిలీజ్ కి క్యూలు కట్టారు. ఇప్పుడు రెండవ సారి రీ రిలీజ్ అవుతున్నప్పటికీ అదే స్థాయి రెస్పాన్స్ వస్తుండడం గమనార్హం. హైదరాబాద్ లో ఈ చిత్రానికి దాదాపుగా అన్ని థియేటర్స్ లోను అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా హౌస్ ఫుల్స్ అయ్యాయి.
గడిచిన 24 గంటల్లో ఈ చిత్రానికి 8 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. కొత్త సినిమాల విడుదల ఉండడంతో చాలా తక్కువ షోస్ మాత్రమే ఈ చిత్రానికి షెడ్యూల్ చేసారు. వాటి నుండే ఈ రేంజ్ టికెట్స్ అమ్ముడుపోవడం సాధారమైన విషయం కాదు. మరోవైపు విశ్వక్ సేన్ హీరో గా నటించిన ‘లైలా’ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై మూడు రోజులైంది. ఇప్పటి వరకు కనీసం 5 వేల టిక్కెట్లు కూడా అమ్ముడుపోకపోవడం గమనార్హం. ‘ఆరెంజ్’ చిత్రానికి రెండు రోజుల క్రితం బుకింగ్స్ ఓపెన్ చేయగా, దాదాపుగా 30 వేలకు పైగా టికెట్స్ సేల్ అయ్యాయి. రెగ్యులర్ షోస్ పెంచమని డిమాండ్ కూడా గట్టిగా వినిపిస్తుంది. చూస్తుంటే ఈ వాలెంటైన్స్ వీక్ మొత్తం ‘ఆరెంజ్’ చిత్రం కబ్జా చేసేలా ఉంది. ‘గేమ్ చేంజర్’ చిత్రం మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుండి అభిమానులకు ‘ఆరెంజ్’ రీ రిలీజ్ కాస్త ఉపశమనం కలిగించి అని చెప్పొచ్చు.