AP CM Chandrababu assets: దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు( CM Chandrababu) పేరును ప్రకటించింది ప్రజాస్వామ్య సంస్కరణ సంస్థ ( ఏడిఆర్). అది మొదలు చంద్రబాబుపై ట్రోల్స్ మొదలయ్యాయి. సోషల్ మీడియా ఖాతాలకు పని చెప్పింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అవినీతి అనే ముద్రపడేలా, మరక అంటేలా వైసీపీ ఎంతగానో ప్రయత్నం చేస్తోంది. అయితే సదరు సంస్థ.. ఏ ప్రాతిపదికన ఈ అంచనాకు వచ్చి జాబితా ప్రకటన విడుదల చేసిన విషయాన్ని మరిచిపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. నిజం చెప్పులేసుకుని బయలుదేరే ముందే.. అబద్ధాన్ని నిజం అన్న నమ్మించడానికి ప్రయత్నిస్తోంది. సాధారణంగా ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ.. ఎన్నికల అఫిడవిట్లలో ప్రముఖులు పొందుపరిచే ఆస్తులను పరిగణలోకి తీసుకొని.. ఇలా సంపన్నుల జాబితాను ప్రకటిస్తుంది. ఇప్పుడు కూడా అదే చేసింది.
Read Also: ఉత్తరాంధ్రకు బిగ్ అలెర్ట్!
మూడు దశాబ్దాల కిందట హెరిటేజ్ ఏర్పాటు..
అయితే చంద్రబాబు మూడు దశాబ్దాల క్రితమే హెరిటేజ్ ఫుడ్స్( Heritage foods) సంస్థను ఏర్పాటు చేశారు. తాను రాజకీయాల్లో ఉండడంతో ఆ సంస్థ బాధ్యత నుంచి తప్పుకొని.. భార్య భువనేశ్వరికి అప్పగించారు. అయితే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. సదరు హెరిటేజ్ సంస్థ కార్యకలాపాలను విస్తరించింది. ఆ సంస్థ షేర్ వ్యాల్యూ పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో వేల కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతోంది. లాభాల బాటలో పయనిస్తోంది. అయితే ప్రస్తుతం భువనేశ్వరి ఆ సంస్థలో ప్రధాన వాటాదారుగా ఉన్నారు. ప్రస్తుత బాధ్యతలను మాత్రం చూస్తున్నారు నారా బ్రాహ్మణి. ఆమె చంద్రబాబు, భువనేశ్వరిల కోడలు. మంత్రి నారా లోకేష్ భార్య. ఇటీవల హెరిటేజ్ షేర్ వాల్యూ గణనీయంగా పెరిగింది. దీంతో ఆ కంపెనీకి ఆదాయం కూడా పెరిగింది.
ప్రధాన వాటాదారుగా భువనేశ్వరి
హెరిటేజ్ లో ప్రధాన వాటాదారుగా నారా భువనేశ్వరి( Nara bhuvneshwari ) ఉన్నారు. ఆమె చంద్రబాబు భార్య. ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులను రూ.39 కోట్ల రూపాయలుగా చూపించారు చంద్రబాబు. కానీ హిందూ అవిభక్త కుటుంబంలో భాగంగా.. తన భార్య పేరిట ఉన్న ఆస్తులను సైతం ఆఫిడవిట్లో చూపించాల్సి ఉంటుంది. అలా హెరిటేజ్ లో ప్రధాన వాటాదారుగా ఉన్న భువనేశ్వరి ఆస్తులు 900 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. దీంతో చంద్రబాబు తన ఆఫిడవిట్లో తన ఆస్తులను 930 కోట్ల రూపాయలుగా చూపించారు. ప్రస్తుతం ఏడిఆర్ సంస్థ దానినే స్పష్టం చేసింది. కానీ దీనిని పట్టించుకోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే ధనిక సీఎం చంద్రబాబు అంటూ ప్రచారం చేయడం మొదలు పెట్టింది. కేవలం అవినీతి సంపాదన ద్వారా ఆయన ఆదాయం సమకూర్చుకున్నట్లు అన్నట్లు ఆరోపిస్తోంది.
Read Also: చంద్రబాబు విషయంలో తప్పుతున్న జగన్ అంచనా!
మరి జగన్ మాటో
అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని( Y S Jagan Mohan Reddy ) పరిగణిస్తే.. ఆయన ఆదాయం వేలకోట్లలో ఉంటుంది. లక్ష కోట్లు వరకు ఉన్న ఆశ్చర్యపోనవసరం లేదని టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి. వాస్తవానికి హెరిటేజ్ ఎప్పుడో పబ్లిక్ ప్రాపర్టీ లోకి వెళ్ళింది. కానీ జగన్మోహన్ రెడ్డి కంపెనీలు బినామీలు. అవి షేర్ మార్కెట్లోకి వెళ్లే అవకాశం లేదు. అవన్నీ సూట్ కేస్ తో పాటు డొల్ల కంపెనీలు అన్న ఆరోపణలు ఉన్నాయి. వాటి ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలోనే ధనిక నేతగా జగన్మోహన్ రెడ్డి పెర్మనెంట్ స్థానం పొందుతారని తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేస్తోంది. అయితే చంద్రబాబు విషయంలో ఇలా ఏడీఆర్ సంస్థ ప్రకటించిందో లేదో.. అప్పుడే దానిని రాజకీయం చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.