Chandrababu strategy: ఏపీలో( Andhra Pradesh) మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ పై రకరకాల చర్చ నడుస్తోంది. పెద్ద ఎత్తున మంత్రుల మార్పు ఉంటుందని టాక్ నడుస్తోంది. కొందరు మంత్రుల పనితీరు బాగాలేదని.. అటువంటి మంత్రులను మార్చేస్తారని టిడిపి అనుకూల మీడియాలోనే కథనాలు వస్తుండడం విశేషం. అయితే దీని వెనుక చంద్రబాబు ప్రణాళిక ఉందా? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. 2024 ఎన్నికల్లో ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమికి అధికారం కట్టబెట్టారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ఎమ్మెల్యేలు సైతం క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. మంత్రుల సైతం మరింత మెరుగ్గా పనిచేస్తేనే ఆ ఫలితాలు అందుకోగలమని చంద్రబాబు చెబుతూ వచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో పట్టు తప్పుతోందన్న అంచనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో చేర్పులు, మార్పులు చేపట్టాలని చంద్రబాబు భావిస్తున్నట్లు ప్రచారం ప్రారంభం అయ్యింది.
విస్తృత చర్చ తరువాతే..
అయితే ఏపీ సీఎం చంద్రబాబు కు( CM Chandrababu) ఒక అలవాటు ఉంది. ఏదైనా చేయాలంటే ముందుగా దానిపై విస్తృత చర్చ జరగాలని భావిస్తారు. అది పార్టీ వర్గాలతో పాటు ప్రజల్లో విస్తృత చర్చ ద్వారా ఆ నిర్ణయంలో మార్పులు, చేర్పులు ఉంటాయి. అయితే ప్రస్తుతం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందా? అన్నదానికి.. ప్రభుత్వ వర్గాల నుంచి లేదని సమాధానం వస్తోంది. అయితే నిప్పు లేనిదే పొగ రాదు అని అడిగేవారికి టిడిపి శ్రేణులనుంచి వింత సమాధానం వస్తోంది. తమ అధినేత వ్యూహం ప్రకారం ఏదైనా జరుగుతుందని.. తొందరపాటు ఉండదని.. అలాగని కీలక నిర్ణయాలు కూడా ఉంటాయని గుర్తు చేస్తున్నారు.
Also Read: వైసిపి షేక్.. ఆ మీడియాతో రచ్చ రంబోలా
కొత్త టీం తో ప్రయోగం..
చంద్రబాబు ప్రయోగాలకు ఇష్టపడతారు. ఇది చాలా సందర్భాల్లో చూసాం కూడా. 2024 ఎన్నికల్లో కొత్తదనాన్ని చూపించారు. కొత్త టీం తో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకున్నారు. కొత్తగా ఎమ్మెల్యేలు గెలిచిన పదిమందికి మంత్రులుగా అవకాశం ఇచ్చారు. అయితే మంత్రులు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదన్న విమర్శ ఉంది. ముఖ్యంగా ప్రతిపక్షాలను రాజకీయంగా తిప్పి కొట్టలేక పోతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. శాఖల ప్రగతి కంటే రాజకీయంగా ఎక్కువగా వైఫల్యం చెందుతున్నారు అన్నది చంద్రబాబు బాధగా తెలుస్తోంది. ఇప్పటికీ చాలామంది మంత్రులు తమ సొంత జిల్లాలపై పట్టు సాధించలేకపోయారు. అందుకే చంద్రబాబు అసంతృప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రచారం పుణ్యమా అని ఆశావహులు ముందుకు వస్తున్నారు. ఎవరికివారుగా తమ ప్రయత్నాల్లో ఉంటున్నారు. కానీ ప్రభుత్వ వర్గాల్లో మాత్రం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పై ఎటువంటి కదలిక లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో..