AP 10th Results: ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh) పదో తరగతి ఫలితాల్లో బాలికలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. బాలురు కంటే బాలికలు అత్యధికంగా ఉత్తీర్ణత సాధించారు. మార్కుల్లో సైతం వారిదే పైచేయిగా నిలిచింది. మొత్తం 81.14% ఉత్తీర్ణత సాధించారు విద్యార్థులు. రాష్ట్రవ్యాప్తంగా 6,14,459 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 4,98,585 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు కంటే బాలికలు 5.78% అధికంగా పాసయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లా 93.90%తో స్థానంలో నిలిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లా 47.64% ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది.
Also Read: మాజీ మంత్రి విడదల రజిని చుట్టు ఉచ్చు.. బెదిరింపు కేసులో కీలక అరెస్ట్!
* చిత్ర విచిత్రాలు
అయితే ఈసారి 10 ఫలితాల్లో చిత్రవిచిత్రాలు వెలుగుచూసాయి. అయితే ఎక్కువమంది విద్యార్థులు ఫస్ట్ డివిజన్లో( first division) ఉత్తీర్ణత సాధించడం విశేషం. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో సైతం రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత నమోదయింది. పేదింట పిల్లలు కూడా మంచి మార్కులు సాధించారు. ఓ నిరుపేద కుటుంబానికి చెందిన ఓ విద్యార్థి ఫలితాల్లో సత్తా చాటింది. అందరి ప్రశంసలు అందుకుంది. కానీ ఆమె కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ చలించిపోయారు. అండగా నిలిచారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ల జడ్పి ఉన్నత పాఠశాలలో అమూల్య అనే విద్యార్థిని 593 మార్కులు సాధించింది. అయితే ఆ విద్యార్థిని కుటుంబం కూలీకి వెళ్తే కానీ పూట గడవదని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు చలించిపోయారు. అమూల్య కుటుంబానికి ఎకరం పొలం మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. భూమిలేని నిరుపేదల పథకం కింద సాయం అందించారు.
* పేద కుటుంబంలో ఆనందం
ప్రభుత్వం ఎకరం భూమి అందించడంతో ఆ పేద కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. అమూల్యకు( Amulya) ఇద్దరు అక్కా చెల్లెలు ఉన్నారు. ముక్కుర్ని పోషించడం తల్లిదండ్రులు అనిల్, రూతమ్మలకు కష్టంగా మారింది. తమకు ప్రభుత్వం ఎకరం పొలం అందించడం పై వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు సొంత భూమి ఉంటే మరింత కష్టపడి పిల్లలను ఉన్నత విద్యావంతులుగా చేస్తామని వారు చెబుతున్నారు. మొత్తం మీద ఓ విద్యార్థిని ప్రతిభ ప్రభుత్వం గుర్తించేలా చేసింది.
* అనేక రికార్డులు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పదో తరగతి ఫలితాల్లో( 10th class results) అనేక రకాల రికార్డులు నెలకొల్పారు విద్యార్థులు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు మెరుగు పడడం శుభసూచికం. కాకినాడకు చెందిన నేహాంజని అయితే ఏకంగా 600 600 మార్కులు సాధించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు సైతం 598 మార్కులు సాధించడం విశేషంగా చెప్పుకోవచ్చు.
Also Read: మాధురి పోస్టింగ్.. దువ్వాడ ఊస్టింగ్!