పదో తరగతి మార్కుల కేటాయింపు ఇలా!

కరోనా రెండో దశ తీవ్ర రూపం దాల్చడంతో పదో తరగతి పరీక్షలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ క్రమంలోనే పదవ తరగతి చదివే విద్యార్థులు అందరిని ఉత్తీర్ణత చేస్తూ పై తరగతులకు ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రద్దయిన పరీక్షలకు మార్కులు కేటాయించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. పదవ తరగతి విద్యార్థులకు మార్కుల గ్రేడ్లు కేటాయించడానికి ఛాయరతన్‌ కమిటీనీ ఏర్పాటు చేసింది. పదవ తరగతి విద్యార్థులకు […]

Written By: Navya, Updated On : July 10, 2021 4:50 pm
Follow us on

కరోనా రెండో దశ తీవ్ర రూపం దాల్చడంతో పదో తరగతి పరీక్షలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ క్రమంలోనే పదవ తరగతి చదివే విద్యార్థులు అందరిని ఉత్తీర్ణత చేస్తూ పై తరగతులకు ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రద్దయిన పరీక్షలకు మార్కులు కేటాయించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.

పదవ తరగతి విద్యార్థులకు మార్కుల గ్రేడ్లు కేటాయించడానికి ఛాయరతన్‌ కమిటీనీ ఏర్పాటు చేసింది. పదవ తరగతి విద్యార్థులకు ఫార్మేటివ్ మార్కుల ఆధారంగా గ్రేడ్లను ఇవ్వాలని ఈ కమిటీ నిర్ణయించింది. పదవ తరగతి విద్యార్థులకు రెండు ఫార్మేటివ్ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఫార్మేటివ్ 1 లోఅత్యధికంగా వచ్చిన మూడు సబ్జెక్టుల మార్కులను ఎంపిక చేసుకొని వాటి ఆధారంగా గ్రేడ్లను నిర్ణయిస్తారు.

ఉదాహరణకు ఒక విద్యార్థికి ఫార్మేటివ్ 1, ఫార్మేటివ్ 2 లో కలిపి 50 మార్కులు వస్తే అత్యధిక సరాసరి సగటు మార్కులు 35 లేదా 40 మార్కులు వస్తే ఆ మొత్తం కలిపి 75 మార్కులుగా పరిగణలోకి తీసుకొని విద్యార్థికి గ్రేడ్లను నిర్ణయించడం జరుగుతుంది.ఇంటర్నల్ మార్కుల ప్రోసెసింగ్ అమల్లోకి రావడానికి సర్కార్ జీఓ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. బుధవారంలోగా దీనిపై అధికారిక స్టేట్మెంట్ రావాల్సి ఉంది.