AP 10th Class Results 2026: ఏపీ పదో తరగతి( 10th classes ) ఫలితాల్లో రికార్డులు నమోదు అయ్యాయి. ఈరోజు పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ద్వారా ఫలితాలను విడుదల చేశారు. బాలురు కంటే బాలికలు పై చేయి సాధించారు. ఏకంగా 87.90% ఉత్తీర్ణత పొందారు. బాలురు మాత్రం 82.68 శాతానికి పరిమితం అయ్యారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణత శాతం పెరిగింది. 78% నమోదు కావడం విశేషం.
– మరోవైపు విశాఖకు చెందిన ఓ విద్యార్థిని ఏకంగా 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి రికార్డు సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా 47 మంది విద్యార్థులు 598 మార్కులు సాధించి సత్తా చాటారు.
– రాష్ట్రవ్యాప్తంగా 2161 పాఠశాలలు 100% ఫలితాలు సాధించాయి. 16 పాఠశాలల్లో అయితే ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు.
Also Read: నలుగురు ప్రొఫెసర్లు తెలంగాణ సమాజాన్ని ఏ దిశకు తీసుకెళ్లారు
– జిల్లాల వారీగా చూస్తే 96.07 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 57.12%తో అల్లూరి జిల్లా చివరి మనసులో నిలిచింది.
– ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఈసారి 96.04 శాతం ఉత్తీర్ణతతో అత్యుత్తమ ప్రతిభను కనబరిచాయి.
– ఫెయిల్ అయిన విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తూ.. మే 25 నుంచి జూన్ 4 వరకు అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష ఫీజును చెల్లించేందుకు మే ఒకటి నుంచి తొమ్మిది వరకు గడువు ఇచ్చారు. రికౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ కోసం మే 1 నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.