https://oktelugu.com/

AP Rains: ఏపీకి మరో ముప్పు.. ప్రజలకు హై అలెర్ట్.. ఈసారి ఏమవుతుందో!

ఏపీకి మరో ముప్పు. వాతావరణ శాఖ నుంచి భారీ వర్ష సూచన వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. దాని ప్రభావంతో ఏపీవ్యాప్తంగా వర్షాలు పడనున్నాయి.

Written By:
  • Dharma
  • , Updated On : November 2, 2024 / 10:31 AM IST

    AP Rains

    Follow us on

    AP Rains: అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు బంగాళాఖాతం నుంచి తుఫాను హెచ్చరికలు వస్తూనే ఉంటాయి. గత నెలలో బంగాళాఖాతంలో దానా తుఫాన్ ఏర్పడింది. మూడు రాష్ట్రాలపై విపరీతమైన ప్రభావం చూపింది. భారీ వర్షాలకు తీర ప్రాంతాలు వణికిపోయాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. దాదాపు 7 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది.దానా ప్రభావం ఉత్తరాంధ్ర పై కూడా పడింది. ఉత్తరాంధ్రలోని ఉమ్మడి జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడ్డాయి. అయితే ఇప్పుడు తాజాగా బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో ఈ ఆవర్తనం ఏర్పడినట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. క్రమంగా ఇది బలపడడానికి అనుకూల వాతావరణం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ ఉపరితల ఆవర్తనం ఈనెల 5 లేదా 6 తేదీల్లో అల్పపీడనంగా బలపడుతుందని వాతావరణ శాఖ ఒక అంచనాకు వచ్చింది.

    * 7 నుంచి వర్ష సూచన
    ఈ నెల 7 నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కావచ్చు. ఉత్తర కోస్తా జిల్లాల్లో చెదురు మాదురుగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే అల్పపీడన ప్రభావంతో శనివారం సైతం వర్షాలు పడతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కూడా తెలిపింది.

    * తమిళనాడు పై ప్రభావం
    ఈ అల్పపీడన ప్రభావం తమిళనాడు పైన ఉండొచ్చు. కిందటి నెలలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో చెన్నైలో అతి భారీ వర్షాలు కురిసాయి. దాని నుంచి బయటపడక మునుపే మరో భారీ వర్ష సూచన తమిళనాడుకు ఉండడంతో అక్కడి ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ముందస్తు చర్యలు చేపడుతోంది. మరోవైపు ఏపీలో వరి కోతలకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి తరుణంలో భారీ వర్ష సూచన ఉండడంతో ఆందోళన చెందుతున్నారు.