AP Survey: ఏపీలో మరో సర్వే హాల్ చల్ చేస్తోంది. ఆత్మసాక్షి సంస్థ తన సర్వే ఫలితాలను వెల్లడించింది.రాష్ట్రవ్యాప్తంగా ఈ సంస్థ సర్వే చేపట్టింది. అందులో భాగంగా ముందుగా ఉత్తరాంధ్రకు సంబంధించి 34 నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుతం ఈ సర్వే సోషల్ మీడియాలో విస్తృత ప్రచారంలో ఉంది.
2019 ఎన్నికలకు ముందు ఆత్మసాక్షి సర్వే పారదర్శకంగా జరిగేది. దాదాపు ఫలితాలకు దగ్గరగా సర్వే ఉండేది. కానీ మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో సర్వే ఫలితాలు తేడా కొట్టాయి. అయినా సరే సదరు సంస్థ సర్వేలను చేపట్టడం కొనసాగిస్తూ వస్తోంది. తాజాగా ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆత్మసాక్షి సంస్థ సర్వే చేసింది. అయితే కేవలం ఉత్తరాంధ్ర ఫలితాలను మాత్రమే వెల్లడించడం విశేషం. ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ స్థానాలకు గాను టిడిపి 16, వైసిపి 10చోట్ల గెలుపొందుతుందని ఈ సర్వే వెల్లడించింది. మరో 8 స్థానాల్లో హోరాహోరీ ఫైట్ నడుస్తుందని తేల్చి చెప్పింది.
శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఐదు చోట్ల టిడిపి, జనసేన, మూడు చోట్ల వైసిపి గెలిచే ఛాన్స్ ఉందని తేలింది. రెండు చోట్ల మాత్రం హోరాహోరి ఫైట్ ఉంటుందని తేల్చింది. విజయనగరంలో 9 అసెంబ్లీ స్థానాలకు గాను నాలుగు చోట్ల వైసిపి, మూడు చోట్ల టిడిపి, రెండు చోట్ల గట్టి ఫైట్ ఉంటుందని తేలింది. విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఎనిమిది చోట్ల టిడిపి, జనసేన, మూడు చోట్ల వైసిపి గెలుపొందే ఛాన్స్ ఉంది. నాలుగు చోట్ల గట్టి ఫైట్ ఉంటుందని ఆత్మసాక్షి సర్వే తేల్చి చెప్పింది.