Andhra University : దేశంలో అత్యంత పురాతన విశ్వవిద్యాలయం.. ఆంధ్ర విశ్వకళా పరిషత్( Andhra vishwakala Parishad ). వందేళ్ల పండుగ జరుపుకుంటోంది. ఎంతోమంది మహనీయులు ఈ విశ్వవిద్యాలయంలో చదివారు. ఎంతోమంది మహానుభావులు వైస్ ఛాన్స్ లర్లుగా వ్యవహరించారు. జాతీయస్థాయిలో కీలక స్థానాలకు చేరుకున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవులు సైతం పొందారు. అటువంటి గొప్పతనం ఆంధ్ర యూనివర్సిటీది. 1926 ఏప్రిల్ 26న ఏర్పాటయింది ఆంధ్ర విశ్వ కళాపరిషత్. వందేళ్ల చరిత్రను పూర్తి చేసుకుంది. శతవసంత వేడుకలు జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 26 వరకు వేడుకలు కొనసాగించాలని నిర్ణయించింది. అయితే ప్రారంభోత్సవ వేడుకలు కళ తప్పాయి.
Also Read : వైసీపీని వదలని RCB.. ఓ అభిమాని హార్ట్!
* ఎంతోమంది ప్రముఖుల సేవలు..
ఆంధ్ర యూనివర్సిటీకి( Andhra University) తొలి ఉపాధ్యక్షుడిగా కట్టమంచి రామలింగారెడ్డి పనిచేశారు. రెండో విసిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వ్యవహరించారు. ఈ ఇద్దరు ఏయూ పురోభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డారు. అటు తరువాత వచ్చిన వీసీలు సైతం తమదైన ముద్ర చాటుకున్నారు. ఏయూలో ఎంతోమంది చదువుకొని ఉన్నత రంగాల్లో స్థిరపడ్డారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, మాజీ స్పీకర్ జీవీఎంసీ బాలయోగి, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రంనాయుడు తో పాటు చాలామంది ఇక్కడ చదివి ఉన్నత స్థానాలకు వెళ్లారు. అటువంటి ఏయూ వందేళ్ల పండుగ జరుపుకుంటుంది అంటే ఎలా ఉండాలి. కానీ కనీసం ఆ సందడి లేకుండా పోయింది. ఎవరు రాకుండానే ఏయూ శతాబ్ది ఉత్సవాలు పేలవంగా ప్రారంభం అయ్యాయి. విశాఖ బీచ్ రోడ్లో వాక్ థాన్ నిర్వహించారు. కానీ ఉత్సాహం అయితే పెద్దగా కనిపించలేదు.
* ముఖం చాటేసిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు..
ఏయూ శతాబ్ది( AU 100 years celebrations ) ప్రారంభ ఉత్సవాలకు సీఎం చంద్రబాబు వచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. కనీసం విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ హాజరైన పర్వాలేదనిపించేది. కనీసం ఇక్కడ చదువుకున్న ప్రముఖులు వచ్చినా కొంత కళ వచ్చేది. కానీ ఎవరు హాజరు కాకపోవడంతో తూతూ మంత్రంగా ప్రారంభించారు. ఏయూకి జాతీయస్థాయిలో మంచి గుర్తింపు ఉంది. ఇప్పటికీ ఆంధ్ర యూనివర్సిటీ కి విదేశీ విద్యార్థులు వస్తూనే ఉన్నారు. నాక్ గ్రేడింగ్ లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. కనీసం యూనివర్సిటీ ఖ్యాతిని చాటి చెప్పేందుకే నైనా వేడుకగా ఈ ప్రారంభోత్సవాన్ని జరిపించాల్సి ఉంది. కానీ ఏదో తూతూ మంత్రంగా మామ అనిపించేశారు.
* ఎంతో పేరున్న విశ్వవిద్యాలయం..
వాస్తవానికి ఏపీలో ఇప్పుడు ఉన్న యూనివర్సిటీలో అత్యంత పురాతనమైనది ఆంధ్ర విశ్వకళా పరిషత్( Andhra vishwakala Parishad ). ఇప్పటికీ అదే ఆదరణతో కొనసాగుతోంది. దాదాపు పదివేల మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. విదేశీ విద్యార్థులు సైతం ఉన్నారు. పురాతన కోర్సుల నుంచి అత్యాధునిక కోర్సుల వరకు అన్ని రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇంతటి ఘనచరిత కలిగిన ఆంధ్ర యూనివర్సిటీ విషయంలో నిర్లక్ష్యం మాత్రం విమర్శలకు తావిస్తోంది. వందేళ్ల వేడుకలు కళ తప్పడం మాత్రం విస్మయం వ్యక్తం అవుతోంది.