Andhra Premier League In AP: ఆంధ్రప్రదేశ్‌లో క్రీడలకు చిత్తశుద్ధితో ప్రోత్సాహం కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్ర ఐటీ, క్రీడా, యువజన వ్యవహారాల శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో, రాష్ట్రంలోని ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు వేదిక కల్పించేలా ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) క్రికెట్ టోర్నమెంట్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
యువ ప్రతిభకు ఒక వేదిక
ఈ లీగ్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు అవకాశం లభిస్తుంది. చాలా మంది యువ ఆటగాళ్లు తమ టాలెంట్‌ను ప్రదర్శించేందుకు ఈ టోర్నమెంట్‌ను వేదికగా చేసుకోనున్నారు. ప్రపంచంలోనే అతి ప్రజాదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తరహాలో, APL కూడా అటు వినోదాన్ని ఇటు అవకాశాలను కలగజేస్తుంది.
Also Read: రాహుల్ జీ.. ఎన్నిరోజులు ఈ కాకమ్మ కథలు
ఈ లీగ్‌లో నితీష్ కుమార్ రెడ్డి, హనుమ విహారి వంటి జాతీయ స్థాయి ఆటగాళ్లు కెప్టెన్లుగా వ్యవహరించడం విశేషం. వీరితోపాటు యువ ప్రతిభావంతులు వారి సమర్థతను చాటుకునే అవకాశం పొందనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ ఉత్సవం
విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం, రాజమండ్రి, కర్నూలు వంటి నగరాలకు ప్రాంచైజీలు ఏర్పాటు చేసి, రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ ఉత్సవాన్ని కల్పించేందుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి. ఈ టోర్నీ కేవలం ఆటగాళ్లకు మాత్రమే కాకుండా, ఏపీ యువతలో స్పూర్తిని, క్రీడల పట్ల ఆసక్తిని, వ్యవసాయేతర రంగాల్లో అవకాశాలను పెంచేలా ప్రభావం చూపనుంది. టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ టోర్నీ ప్రత్యక్ష ప్రసారం అవుతుండటంతో దేశవ్యాప్తంగా కళ్లన్నీ ఆంధ్రా మీదే నిలవనున్నాయి.
వైజాగ్ బీచ్‌ల నుంచి తుంగభద్ర తీరాల వరకు, రాయలసీమ రాతిబండల నుంచి గోదావరి గాథల వరకు ఏపీ అంతా ఇప్పుడు క్రీడా మేళావళిగా మారబోతుంది!
From the beautiful beaches of #Vizag to the tranquil banks of Tungabhadra to pristine Rayalaseema, all of #AndhraPradesh is getting padded up.
The Andhra Premier League cricket championship is taking off soon! Are you ready? #DhummuLepu @theacatweets #APL2025 pic.twitter.com/kUI7F7Bt03
— Lokesh Nara (@naralokesh) August 7, 2025