Homeఆంధ్రప్రదేశ్‌Mala Gangamma Case: నిన్న సాయికృష్ణ.. నేడు మాలగంగమ్మ.. ఏపీలో ఏంటీ "బలి" ప్రయోగాలు

Mala Gangamma Case: నిన్న సాయికృష్ణ.. నేడు మాలగంగమ్మ.. ఏపీలో ఏంటీ “బలి” ప్రయోగాలు

Mala Gangamma Case: ఏ ప్రాంతంలోనైనా శాంతి భద్రతలు మెరుగ్గా ఉంటేనే ప్రజల జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లోనే జనజీవనం సాఫీగా సాగుతూ ఉంటుంది. మనదేశంలో ఏ ప్రాంతానికైనా సరే విదేశీయులు వెళుతుంటారు. అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. స్వేచ్ఛాయుత అనుభూతులను సొంతం చేసుకుంటారు. అదే విదేశీయులు పాకిస్తాన్ వెళ్లగలరా.. స్వేచ్ఛగా జీవించగలరా.. ఇక్కడ శాంతి భద్రతలను పరిరక్షించేది ప్రభుత్వం… పోలీసులు.

శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. ఇటువంటి అవకాశాలను ప్రతిపక్ష పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాయి కాబట్టి.. అధికారంలో ఉండే ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. అందువల్లే పోలీసులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవద్దు. శిక్షలు.. ఇతర వ్యవహారాలు సాగించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. నేరాన్ని రుజువు చేయడం మాత్రమే పోలీసుల విధి. కోర్టు అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే అంతిమంగా హింస రాజ్యమేలుతూ ఉంటుంది.

అప్పట్లో తమిళనాడులో కరోనా సోకినప్పుడు.. నిబంధనలు ఉల్లంఘించి సెల్ఫోన్ షాప్ ఓపెన్ చేశారని.. ఇద్దరు తండ్రి కొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తీవ్రంగా హింసించడంతో తండ్రి కొడుకులు చనిపోయారు. అయితే ఈ వ్యవహారాన్ని అక్కడి కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆ తర్వాత ఈ దారుణంలో పాలుపంచుకున్న వారందరికీ మరణశిక్ష విధించింది. పోలీసులు పాల్పడిన ఘోరాన్ని చూసి న్యాయస్థానం ఊరుకోలేదు. కఠినమైన శిక్ష విధించింది. తద్వారా ఇటువంటి తప్పులు మరొకరు చేయకుండా ఉండడానికి కఠినమైన నిబంధనలు విధించింది.

ఏపీ రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కొంతకాలంగా విమర్శలకు కారణమవుతోంది. పోలీసులు ఇటీవల సాయి కృష్ణ అనే యువకుడి విషయంలో వ్యవహరించిన తీరు జాతీయస్థాయిలో చర్చకు కారణమవుతోంది. సాయి కృష్ణ వ్యవహారాన్ని మర్చిపోకముందే.. ఇప్పుడు తెరపైకి మాల మంగమ్మ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ సంఘటన సాయి కృష్ణ వ్యవహారానికి మించి ఉందని తెలుస్తోంది. మంగమ్మ కేసును లోతుగా తవ్వితే మరిన్ని నిజాలు బయటపడే అవకాశం ఉంది.

మంగమ్మ అది కర్నూలు జిల్లా కౌతాళం మండలం. ఈమెకు వీరేష్ 17 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. సరిగ్గా వీరేష్ ఏడాదిన్నర క్రితం కనిపించకుండా పోయాడు. దీంతో మంగమ్మ పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోలీసులు అతడి జాడను కనుక్కోలేకపోయారు. ఈ దశలో మంగమ్మ తన కొడుకు కోసం కోర్టు మెట్లు ఎక్కింది. హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు స్పందించారు. వీరేష్ ను మంగమ్మ చంపిందని పోలీసులు తేల్చారు. మంగమ్మ దర్గప్ప అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని.. అది వీరేష్ చూసిన నేపథ్యంలో.. వారిద్దరూ కలిసి అతనిని చంపారని పోలీసులు తేల్చారు. గంగమ్మ.. దుర్గప్పను పోలీసులు విచారించిన సమయంలో.. గంగమ్మ ఊహించని విధంగా చనిపోయింది… ప్రస్తుతం గంగమ్మ కేసు హైకోర్టు పరిధిలో ఉంది. గంగమ్మకు సంబంధించిన పోస్టుమార్టం నివేదికను తమకు అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

గంగమ్మ భర్త చనిపోయిన తర్వాత దర్గప్పతో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఒకవేళ ఆమె తన కొడుకును చంపుకుంటే.. పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేస్తుంది.. హైకోర్టు దాకా ఎందుకు వెళ్తుంది.. ఒకవేళ పరిహారం కోసమే అయితే.. దర్గప్ప తో తాను సాగిస్తున్న వ్యవహారం పోలీసుల విచారణలో బయటపడుతుంది కదా.. అలాంటప్పుడు ఆమె పోలీసుల దాకా ఎందుకు వెళ్తుంది.. పైగా అనుమానాస్పద స్థితిలో మంగమ్మ చనిపోయినప్పుడు పోలీసులు దగ్గర ఉండి దహన క్రియలు నిర్వహించారు.. ఇది అనేక రకాల అనుమానాలకు కారణమవుతోంది. ఒకవేళ హైకోర్టుకు సమర్పించిన పోస్టుమార్టం నివేదికలో.. పోలీసులకు ప్రతికూల ఫలితం వస్తే గనుక ఏపీ రాష్ట్రంలో అనేక పరిణామాలు జరుగుతాయి. పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో పకడ్బందీగా ఉండాలి. అలాకాకుండా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఇదిగో ఇటువంటి పరిణామాలే ఎదురవుతాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular