Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh Legislative Council Controversy: శాసనమండలి చైర్మన్ ప్రభుత్వానికి తలొగ్గుతున్నారా?!

Andhra Pradesh Legislative Council Controversy: శాసనమండలి చైర్మన్ ప్రభుత్వానికి తలొగ్గుతున్నారా?!

Andhra Pradesh Legislative Council Controversy: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీకి ఏపీ శాసనమండలిలో స్పష్టమైన బలం ఉంది. అక్కడే కూటమి ప్రభుత్వంతో తేల్చుకుందామని ఓడిపోయిన మరుక్షణం నుంచి జగన్మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. ఎందుకంటే మండలి చైర్మన్ గా ఉన్న మోసేన్ రాజు ఆ పార్టీకి చెందిన నేత. అధికార పార్టీకి ధీటుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలో అవకాశం ఇస్తారని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే పరిస్థితులు నడిచాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల రాజీనామాను చైర్మన్ ఇంతవరకు ఆమోదించలేదు. అంటే ఆ పార్టీకి ఫేవర్ చేసినట్టే. కానీ ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారంలో రాజకీయ వివాదం ముదిరింది. ఈ సమయంలో సైతం భారీగా ఫేవర్ అడుగుతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. అందుకు చైర్మన్ మోసేన్ రాజు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. శాసనమండలి నియమ నిబంధనలకు అనుగుణంగా వెళ్తానే తప్ప.. సొంత నిర్ణయాలు తీసుకోలేనని తేల్చి చెప్పినట్లు సమాచారం.

* పదేపదే తిరస్కరణ..
తాజాగా శాసనమండలిలో హెరిటేజ్ పై ( heritage) చర్చ జరపాలంటూ ఇస్తున్న వాయిదా తీర్మానాలు పదేపదే తిరస్కరణకు గురవుతున్నాయి. మండలి చైర్మన్ వాటికి అంగీకరించడం లేదు. సభా సంప్రదాయాలకు అనుగుణంగా ముందుకు సాగుతుండడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మింగుడు పడడం లేదు. సభలో మెజారిటీ ఉండి కూడా తాము ఏం సాధించలేకపోతున్నామన్న బాధ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. హెరిటేజ్ వంటి అంశాలపై చర్చకు పట్టుపడుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఎందుకో మండలి చైర్మన్ భయపడుతున్నారు. ఆయన నుంచి అనుకూల నిర్ణయాలు రాకపోవడంతో వైసిపి సభ్యుల నుంచి తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వైసీపీ సభ్యుల నుంచి.. ఈ విషయంలో అసహనం వ్యక్తం అవుతోంది.

* చైర్మన్ తీరుపై చర్చ..
శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు పై( Mohsin Raju ) క్రమేపి వైసిపి సభ్యులు అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రభుత్వం ఇచ్చే జవాబులకే ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారని వైసీపీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ఎమ్మెల్సీల అంతర్గత చర్చల్లో కూడా ఇదే అంశం హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా సభలో నిరసన తెలుపుతూ శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రపటాలను ప్రదర్శించిన తీరు వైయస్సార్సీపీని ఆత్మ రక్షణలో పడేసింది. కాళ్లకు చెప్పులు, బూట్లు ధరించి దేవుడు పటాలను పట్టుకున్న వీడియోలు బయటకు రావడంతో ప్రజల నుంచి వ్యతిరేకత ప్రారంభం అయింది. అయితే ఈ వీడియోలు ఎలా బయటకు వచ్చాయి అని చైర్మన్ తీరును తప్పుపడుతున్నారు వైసీపీ సభ్యులు. అయితే మండలి చైర్మన్ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గుతున్నారా? అనే చర్చి మాత్రం జరుగుతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో. శాసనమండలిలో బలం ఉంది కదా అనుకుంటే తమ మాట చెల్లుబాటు కావడం లేదన్న ఆవేదన పార్టీ వర్గాల్లో ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version