Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh Heavy Rain Warning: ఏపీలో ఈ జిల్లాల ప్రజలు అస్సలు ఇళ్ల నుంచి...

Andhra Pradesh Heavy Rain Warning: ఏపీలో ఈ జిల్లాల ప్రజలు అస్సలు ఇళ్ల నుంచి బయటకు రావద్దు..

Andhra Pradesh Heavy Rain Warning: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. మండే ఎండల నుంచి ఉపశమనం కలిగించే వార్త చెప్పింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ఉపరితల ఆవర్తనం, ద్రోణీ ప్రభావంతో మంగళవారం పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. అదే సమయంలో మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని.. ఇలా విభిన్న వాతావరణ పరిస్థితులు ఏపీలో కొనసాగునున్నాయని చెబుతోంది. మరోవైపు పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఇటీవల ఏపీలో ఎండల తీవ్రత పెరిగింది. భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పరిస్థితి ఒక్కసారిగా మారింది.

Also Read: అమెరికాలోని బే ఏరియాలో ఘనంగా టీడీపీ ’ఆవిర్భావ’ వేడుకలు

* ఈరోజు ప్రధానంగా శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, నంద్యాల, కర్నూలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం జిల్లాలో సైతం తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఒక వైపు వర్షాలు కొనసాగుతుండగా.. మరికొన్ని జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎనిమిది మండలాల్లో మంగళవారం తీవ్రవాడగాల్పులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియమ్మవలస, కొమరాడ, కురుపాం, సీతానగరం మండలాలతో పాటు పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయి.

* రాయలసీమలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. సోమవారం కడప జిల్లాలోని ఒంటిమిట్ట, కాజీపేటలో అత్యధిక ఉష్ణోగ్రత 42.5 గా నమోదయింది. కర్నూలు జిల్లా లద్దగిరిలో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.* ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.. అత్యవసరం అయితే తప్ప ఇళ్ళ నుంచి బయటకు రావద్దని చెబుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular