Deputy Cm Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజులుగా వైరల్ ఫీవర్ తో తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారని, జ్వరంతో పాటు స్పాండిలైటిస్ ఆయన్ని మరింత ఇబ్బందికి గురి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారి అభిమానులను తీవ్రమైన కలవరానికి గురి చేస్తుంది. వైద్యుల సూచన మేరకు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో గురువారం జరగబోయే క్యాబినెట్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ హాజరు అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఉపముఖ్యమంత్రి కార్యాలయం నుండి కబురు అందింది. రిపబ్లిక్ డే తర్వాత పవన్ కళ్యాణ్ తన భార్య పిల్లల కోసం స్విజ్జర్ ల్యాండ్ కి వెళ్ళాడు. వాతావరణం మారడం కారణంగా పవన్ కళ్యాణ్ కి ఈ వైరల్ ఫెవర్ సోకి ఉండొచ్చని అంటున్నారు అభిమానులు. పవన్ కళ్యాణ్ కి చిన్నప్పటి నుండి సైనస్ తో పాటు ఆస్తమా కూడా ఉంది.
ఆస్తమా కారణంగానే ఆయన ఇప్పటి వరకు ప్రజాక్షేత్రంలో పాదయాత్ర చేయలేకపోయాడు. అదే విధంగా ఆయనకీ కొమరం పులి సినిమా సమయం నుండి స్పాండిలైటిస్ సమస్యలు కూడా ఉన్నాయి. అంటే వెన్ను నొప్పి అన్నమాట. పవన్ కళ్యాణ్ లో రోగ నిరోధక శక్తి కూడా చాలా తక్కువే. నిటారు ఎండల్లో ఎక్కువసేపు తిరిగినా, వానల్లో తడిచిన, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు త్రాగినా ఆయనకు వైరల్ ఫీవర్ సోకుతుంది. కరోనా సమయంలో పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కరోనా నుండి ఆయన పూర్తి స్థాయిలో కోలుకోవడానికి దాదాపుగా ఆరు నెలల సమయం పట్టింది. అంతటి సెన్సిటివ్ ఇమ్మ్యూనిటి సిస్టం పవన్ కళ్యాణ్ ది. రాబోయే 5 రోజుల్లో ఆయన ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పుడు వైరల్ ఫీవర్ కారణంగా అవన్నీ క్యాన్సిల్ అయ్యాయి.
మరోవైపు ఆయన ‘హరి హర వీరమల్లు’ మూవీ షూటింగ్ లో కూడా పాల్గొనాల్సి ఉంది. అది కూడా వాయిదా పడినట్టే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేని కొన్ని కీలక సన్నివేశాలను సారధి స్టూడియోస్ లో తెరకెక్కిస్తున్నారు. కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. షూటింగ్ మొత్తం దాదాపుగా పూర్తి అయ్యినట్టే. మార్చి 10వ తేదీ లోపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేసి మార్చి 28 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి సంబంధించి నాలుగు రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉంది. ఎలా అయినా ఈ వారం లో షూటింగ్ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆయన అనారోగ్యం పాలవ్వడంతో అది వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలాఖరున మళ్ళీ పవన్ కళ్యాణ్ షూటింగ్ సెట్స్ లోకి రావొచ్చు. మరో వైపు ఫిబ్రవరి 24 నుండి అసెంబ్లీ లో బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి.