Sankranthiki Vasthunnam Collection
Sankranthiki Vasthunnam Collection : విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం థియేటర్స్ లో విడుదలై మూడు వారాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో పాటు విడుదలైన రెండు సినిమాలు థియేటర్స్ నుండి వెళ్లిపోయాయి కానీ, సంక్రాంతికి వస్తున్నాం మాత్రం డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకెళ్తూనే ఉంది. ప్రాంతీయ బాషా చిత్రాల్లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన ఈ చిత్రం, 22 వ రోజు ఏకంగా 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. రేపు, ఎల్లుండి కొత్త సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయినప్పటికీ కూడా బయ్యర్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ కోసం థియేటర్స్ బ్లాక్ చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే కొత్తగా రాబోతున్న సినిమాలకు ఒకవేళ ఫ్లాప్ టాక్ పడితే, ఈ వీకెండ్ లో కూడా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం పవర్ ప్లే బ్యాట్టింగ్ చేస్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 270 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
అందులో తెలుగు రాష్ట్రాల నుండే 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 133 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. దేవర చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఆ వసూళ్లను ఈ చిత్రం ఫుల్ రన్ లో అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి నిన్న ఒక్క రోజే కోటి 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది ఇలా ఉండగా సూపర్ హిట్ టాక్ వచ్చిన మన సీనియర్ హీరోల సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో ఇరగకుమ్మడం అందరూ ఊహించేదే. కానీ ఈ చిత్రం కర్ణాటక ప్రాంతం లో కూడా కళ్ళు చెదిరే వసూళ్లను రాబట్టింది. మెగాస్టార్ చిరంజీవి తర్వాత విక్టరీ వెంకటేష్ ఆ అరుదైన రికార్డు ని నెలకొల్పాడు.
కర్ణాటక లో ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 2 కోట్ల రూపాయలకు మాత్రమే జరిగింది. కానీ ఇప్పటి వరకు ఈ చిత్రానికి ఆ ప్రాంతం లో 9 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే పెట్టిన డబ్బులకు దాదాపుగా 5 రెట్లు లాభాలు అన్నమాట. ఈ రేంజ్ లో ఒక సినిమాకి లాభాలు రావడం గతంలో ఎప్పుడు కూడా చూడలేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఓవర్సీస్ లో కూడా ఇదే పరిస్థితి. ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, గల్ఫ్ దేశాలకు కలిపి ఈ సినిమాకి దాదాపుగా 5 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటి వరకు స్టార్ హీరోలకు తప్ప, సీనియర్ హీరోలకు ఈ స్థాయి వసూళ్లు రాలేదు అనుకోవచ్చు. నిర్మాతలు ఈ చిత్రానికి 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని పబ్లిసిటీ చేస్తున్నారు కానీ, ఇప్పటి వరకు కేవలం 270 కోట్లు మాత్రమే వచ్చాయి. ఫుల్ రన్ లో 300 కి చేరుకుంటుందో లేదో కొత్త సినిమాల ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది.