Andhra Jyothi RK: తెలుగుదేశం పార్టీకి( Telugu Desam Party) బలమైన మీడియా మద్దతు ఉంది. అది కాదనలేని సత్యం. కానీ ఆ మీడియా తెలుగుదేశం పార్టీకి వారమో.. శాపమో అన్నది అర్థం కావడం లేదు. ఆ సెక్షన్ ఆఫ్ మీడియా బాధితులంతా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకులుగా మారిపోయిన వారే. చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీపై మంచి నమ్మకం ఉన్నా.. ఆ మీడియా చేసే అతి వల్ల చాలామంది చంద్రబాబును వ్యతిరేకించాల్సిన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన ప్రతిసారి.. తమ సలహాలు, సూచనలు పాటించకపోవడం వల్లే అని చెబుతారు. గెలిస్తే మాత్రం అదంతా మా చలువే అన్నట్టు వ్యవహరిస్తారు. ఈ విషయంలో రాధాకృష్ణ నేతృత్వంలోని ఆంధ్రజ్యోతి మీడియా ముందుంటుంది.
Also Read: విచారణకు ఏపీకొచ్చిన రాంగోపాల్ వర్మ.. అరెస్ట్ కు రంగం సిద్ధం?
అధికార పత్రికగా
సగటు తెలుగుదేశం పార్టీ అభిమాని విపరీతంగా ఆంధ్రజ్యోతిని( Andhra Jyothi ) అభిమానిస్తారు. ఎందుకంటే వారికి రుచించే విధంగా కథనాలు ఉంటాయి. ఆ వార్తలకి అక్కడ ప్రాధాన్యం ఉంటుంది. చంద్రబాబుతో పాటు లోకేష్ నాయకత్వాన్ని అమాంతం పెంచుతుంది ఆంధ్రజ్యోతి. అదే సమయంలో వారి రాజకీయ ప్రత్యర్థులను సైతం వెంటాడుతుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రజ్యోతి అనేక రీతుల్లో లాభ పడింది కూడా. తెలుగుదేశం పార్టీకి అధికార పత్రికగా ఉంది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి చంద్రబాబు తమ చెప్పు చేతల్లో ఉండాలని ఎక్కువగా భావిస్తారు రాధాకృష్ణ. అందుకే రకరకాల రూపంలో సలహాలు ఇస్తుంటారు. చంద్రబాబు సైతం కొన్నింటిని పాటిస్తారు. మరి కొన్నింటిని పాటించరు.
Also Read: పులివెందులలో రీపోలింగ్.. జగన్ సంచలనం!
అలా విషం నింపుతోంది
తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆంధ్రజ్యోతిని విపరీతంగా విశ్వసిస్తాయి. ఆంధ్రజ్యోతి సైతం టిడిపి శ్రేణుల అభిమతాన్ని గుర్తిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రజ్యోతి టిడిపి శ్రేణులు ఒక రకమైన విషం నింపే ప్రయత్నం చేస్తోంది. ఏపీలో మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ప్రభుత్వ అడ్వకేట్ గా ఉన్న దమ్మాలపాటి వైసిపికి అనుకూలంగా పని చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఒక బాధ్యతాయుతమైన ఏజీగా ఉన్న ఆయన వైసిపి నేతలకు బెయిల్ వచ్చేలా వ్యవహరించారు అన్నది ఒక ప్రధాన అనుమానం. ఆది నుంచి మద్యం కుంభకోణం కేసులో నేటి ప్రభుత్వ పెద్దల నుంచి వైసీపీ నాయకులకు సహకారం అందుతోంది అనేది సగటు టిడిపి శ్రేణుల అనుమానం. ఇదే విషయాన్ని రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి. జగన్ ట్రాప్ లో అంటూ భారీ కథనం వండి వార్చింది. కానీ ఆది నుంచి ఆంధ్రజ్యోతి కథనాలు చూస్తే అది జగన్ ట్రాప్ కాదు.. ముమ్మాటికి ఆంధ్రజ్యోతి ట్రాప్ అని తెలుస్తోంది. అధికార పత్రికగా ఉన్న ఆంధ్రజ్యోతికి ఎక్కడ కోపం వచ్చిందో తెలియదు కానీ.. ఏం లోటు జరిగిందో తెలియదు కానీ.. చిన్నచిన్న లోపాలను ఎత్తిచూపుతూ కథనాలు రాయడం ప్రారంభించింది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన అపనమ్మకాన్ని, అనుమానాలను పంపించగలిగింది. అంతకుమించి ఏం కనిపించడం లేదు. ఇక తేల్చుకోవాల్సింది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. సీఎం చంద్రబాబు. తమ పార్టీ కోసం, తమ పార్టీ ప్రయోజనాల కోసం ఆంధ్రజ్యోతి ఎక్కువగా పని చేస్తుంది అనేది చంద్రబాబు నమ్మకం. కానీ ఆ నమ్మకం పోగొట్టుకునేలా రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి వ్యవహరిస్తోంది.